తోటి కళాకారులను ఆయన అక్కున చేర్చుకునేవారు. కొరియోగ్రాఫ్ చేసే సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోనైనట్లు నాకిప్పటి వరకూ తెలియలేదని చెప్పింది రష్మీ గౌతమ్. అయితే ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే తమతో చెప్తే సాయం చేసే వాళ్లం. కానీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం నాతో పాటు తోటి కళాకారులను ఆయన శిష్యులన కూడా బాగా కుంగదీస్తుంది.
మాస్టర్ మీరు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రష్మీ గౌతమ్. ఆమె సోషల్ మీడియా వేధికగా ఇన్ స్టాగ్రమ్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘చైతన్య నీ సమస్యకు ఇదైతే పరిష్కారం కాదు. నీ ఫ్యామిలీకి, సన్నిహితులకు ఆ దేవుడు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటున్నాను. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని పోస్ట్ పెట్టారు.