
Ancient Bible : హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత, ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్, క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్. ఎవరి పవిత్ర గ్రంథం వారికి ఆత్మలాంటిది. వాటిని జీవితంలో ఒక్కసారైనా చదవాలని అందరు ఉత్సాహపడుతుంటారు. అందులోని సారాంశాన్ని గ్రహించి మన జీవితాన్ని మలుచుకోవాలని చూస్తారు. అన్ని మతాల గ్రంథాలు కూడా మంచినే చెబుతాయి. కానీ వారు ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. ఏ మత గ్రంథమైనా మంచి చెబుతుంది. మనిషిగా జీవించాలని సూచిస్తుంది. మనిషి విపరీత పనులే ఇబ్బందులు తెస్తాయి.
మన పవిత్ర గ్రంథం భగవద్గీతలో శ్లోకాలు ఉంటాయి. బైబిల్ లో అధ్యాయాలు ఉంటాయి. అమెరికాలో 1100 ఏళ్ల క్రితం నాటి బైబిల్ కు చాలా మంది కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. చేతి రాతతో ఉన్న ఈ బైబిల్ పై అందరికి ఆసక్తి ఏర్పడింది. దీంతో దీన్ని సొంతం చేసుకోవాలని భావించారు. అందరు వేలంలో పాల్గొన్నారు. చివరకు రూ. 314 కోట్ల ధర పలకడం విశేషం.
ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన బైబిల్ గా రికార్డు సాధించింది. ఇంత భారీ మొత్తంలో ధర పలకడంతో అందరు ఆశ్చర్యపోయారు. బైబిల్ ను దక్కించుకోవడానికి చాలా మంది పోటీలో ఉన్నా ఇంత భారీ ధర రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో బైబిల్ కు ఉన్న విలువ అలాంటిది.
కోడెక్స్ సానూన్ అనే హీబ్రు బైబిల్ ప్రపంచంలోనే పురాతనమైనది. దీంతో దీన్ని సొంతం చేసుకోవాలని చాలా మంది చూశారు. మొత్తానికి ఇంత భారీ మొత్తంలో ధర పలికి విశేషమైన ప్రాచుర్యం పొందింది. ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడైన బైబిల్ గా మారింది.