40.1 C
India
Friday, May 3, 2024
More

    Congress Guarantees : ‘గ్యారెంటీల’ దరఖాస్తులు.. అనేక సందేహాలు..!

    Date:

    Congress Guarantees
    Congress Guarantees

    Congress Guarantees Many Doubts : ప్రజాపాలన కార్యక్రమం మూడో రోజు ప్రారంభమైంది. తొలి రెండు రోజుల్లో ప్రజాపాలన కేంద్రాల వద్దకు జనాలు భారీగానే పోటెత్తారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘అభయహస్తం’ పేరిట 6 గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుల్లో ఎక్కువ మంది రేషన్ కార్డులు, గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లకు పథకాల కోసం దరఖాస్తు ఫారాల్లో కోరుతున్నారు. అప్లయ్ చేసినవారిలోనూ, చేయని వారిలోనూ ఎన్నెన్నో సందేహాలు కలుగుతున్నాయి. వాటిపై అధికారులను అడిగిన వారూ తమకు తెలియదంటున్నారు. ఇప్పటికే రెండు రోజులు పూర్తయింది. 31,1వ తారీఖుల్లో సెలవు దినాలు. ఇక ఆ తర్వాత 5 రోజుల సమయయే ఉంటుంది. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇంకా కొందరికీ తాము ఎక్కడ దరఖాస్తు చేయాలనే సందిగ్ధంలోనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో వస్తున్న సందేహాలు కొన్ని ఇవి…

    – రేషన్ కార్డు మా ఊరిలో ఉంది.. కుటుంబంతో సహ పట్టణంలో ఉంటున్నా.. నేను ఎక్కడ దరఖాస్తు చేయాలి?
    – రేషన్ కార్డు యజమానిగా ఆడవాళ్ల పేరు ఉంది. దరఖాస్తును వారి పేరు మీదుగా నింపాలా? లేకుంటే ఇంటి యజమాని అయిన భర్త పేరు మీదుగా నింపాలా?
    -రేషన్ కార్డు ఊళ్లో ఉంది.. మేం పట్టణంలో దరఖాస్తు చేసుకోవచ్చా?
    – గ్యాస్ కనెక్షన్లు మగవారి పేరు మీద ఉన్నాయి.. సబ్సిడీ 500లకే సిలిండర్ రావాలంటే ఆడవారి పేరు మీదకు మార్పించాలా?
    – మాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఊరిలో ఉంది. గ్యాస్ కనెక్షన్ పట్టణంలో ఉంది. ఎక్కడా అప్లయ్ చేసుకోవాలి.
    -మాకు ఊళ్లో పొలాలు ఉన్నాయి. రైతుభరోసా కింద అక్కడే అప్లయ్ చేసుకోవాలా?
    –  రైతుబంధు, పింఛన్లను ఇంతకుముందే పొందుతున్నాం. మేం మళ్లీ అప్లయ్ చేసుకోవాలా?
    – మహిళలకు రూ.2500 పథకంలో లబ్ధి పొందడానికి ఇంటిలో ఆడవాళ్లు అందరూ అర్హులేనా?
    – ఇంతకు ముందు పింఛన్ లబ్ధిదారులు గృహలక్ష్మి కి కూడా అప్లయ్ చేసుకోవచ్చా?
    – పట్టణంలో ఇల్లు ఉంది. దానికి కరెంట్ మీటర్ ఉంది. పొలాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు గ్రామంలో ఉంది. గ్రామంలో దరఖాస్తు చేయాలా? పట్టణంలో చేయాలా? పట్టణంలో ఇంటికి గృహజ్యోతి వర్తిస్తుందా?

    ఇలా ఎన్నెన్నో అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ విషయంలో చదువుకున్న వారికే అనేక సందేహాలు ఉంటే.. నిరక్షరాస్యుల పరిస్థితి  ఇంకా గందరగోళంగా ఉంది. వీటిపై అధికారులను అడిగితే వారు కూడా అనుమానాలను నివృత్తి చేయలేకపోతున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజలకు వచ్చే అనుమానాలను ముందుగానే గుర్తించి క్లారిటీ ఇస్తే బాగుండేది. అవేవీ చేయకుండానే దరఖాస్తులు తీసుకుంటుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఈ సందేహాలన్నింటిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

    Share post:

    More like this
    Related

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    CM Revanth : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

    CM Revanth : రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం...

    Revanth Reddy : తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డితో అవుతుందా?

    CM Revanth Reddy : కాంగ్రెస్ ముందు మరో సవాలు ఎదురవుతోంది....

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. అదుపులో మరో ఇద్దరు

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా...