నేటి బాలలే రేపటి పౌరులు ……. ఈ బాల భారతమే రేపటి యువ భారతం. దేశ సంపద ఈ బాలలే ….. అనే విషయం తెలిసిందే. నవ భారతానికి వెన్నెముక ఈ బాలలే…….. అయితే అలాంటి భావి భారత పౌరులలో కొంతమందికి తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. మరికొందరు ఎంత తిన్నా తరగని ఆస్తి సొంతం చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
అయితే ఈ బాలల వయసులో…… వాళ్ళ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. కోపం వస్తే …… కోపాన్ని , ప్రేమ వస్తే …… ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. రోడ్డు పక్కన ఉన్న ఈ ఇద్దరు పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి కొబ్బరి బోండం తో సేద తీరుతున్నారు. కొబ్బరి బోండం లో స్వచ్ఛమైన నీరు ఉంటుంది. అలాగే మనిషికి పోషకాలు అందించే గుణం ఉంటుంది. ఇక ఈ పసిపిల్లల హృదయం కూడా కొబ్బరి బోండం లాంటిదే…… సమాజానికి ….. భావి భారతానికి ఉపయోగపడటం తప్ప ఎలాంటి హానీ చేయని మనస్తత్వం ఈ పసి మొగ్గల సొంతం.