
Devulapalli Amar : ప్రజల కన్నీటి కష్టం తీర్చేందుకు జర్నలిస్ట్ ఎప్పుడూ ముందుండాలి. ప్రజల కోసం ప్రభుత్వంతో నిత్యం పోరాటం చేయాలి. ఇందులో కొంత మంది తమ వ్యక్తిత్వాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు వస్తుంటారు. మరి కొంత మంది దాన్ని కాపాడుకుంటారు. వ్యక్తిత్వాన్ని అమ్ముకోవడంలో అగ్రగణ్యుడు దేవులపల్లి అమర్. స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలను నిందించి, వారంతా దోపిడీ దారులంటూ ముద్రవేసి ఇప్పుడు అదే దోపిడీ దారుల సొమ్ము మెక్కుతున్నారు. అప్పుడే అంత చేసిన దేవులపల్లి ఇప్పుడు వైసీపీ ముసుగుతొడిగారు. కావాలనుకున్నప్పుడల్లా జర్నలిజం అంటూ వైసీపీకి వంతపాడుతున్నాడు. ఆర్జీవీ హోస్ట్ గా నిర్వహిస్తున్న షో ‘నిజం’ ఇందులో పాల్గొన్న ఆయన ‘పతివ్రత పరమన్నం వండితే ఆరు నెలలైనా చల్లారదనే’ చందాన్ని గుర్తుకు చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై మీడియాలో జరుగుతున్న ప్రచారంపై దేవులపల్లి గగ్గోలు పెడుతున్నారు. జర్నలిజం విలువల గురించి మాట్లాడించడానికి సాక్షి కూడా సిగ్గు పడింది కావచ్చు.. కూలీ మీడియాలు కూడా ఆయన నీడ పడేందుకు అంగీకరించలేదో కానీ ఓ పెయిడ్ యూట్యూబ్ ఛానల్ లో చర్చ పెట్టి జర్నలిజంపై నీతులు వల్లించారు. ఇందులో ఆయన చెప్పిన ప్రతీ మాట, వ్యాక్యం ‘సాక్షి’కి వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పిన జర్నలిజం ప్రమాణాలు పాటించని ఒకే ఒక్క సంస్థ అది. కానీ ఆయన మాత్రం.. అదంతా తన ఇష్టమైన మీడియా కాదు నిజాలు చెబుతున్న ఇతర మీడియాది అన్నట్లు బురద చల్లే ప్రయత్నం చేశారు.
ఇక దేవుపల్లి జర్నలిస్ట్ ముసుగులో చేసిన ఘనకార్యాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోనవసరం లేదు.
సాక్షిలో ఏం చేశారో అనేక కథలు చెప్తాయి. వైఎస్ వివేకాను హత్య కేసును చంద్రబాబుకు అంటించేసి.. బాబు చేతిలో వేట కత్తి గ్రాఫిక్స్ చేసి పెట్టి.. నరకాసుక రక్త చరిత్ర అని రాస్తే.. ఈ దేవులపల్లి అమరే.. స్క్రీన్ మీదకెళ్లి.. తానే కళ్లతో చూసినట్లుగా.. చంద్రబాబే నరికి చంపినట్లుగా అద్భుత సృష్టే కళ్ల ముందుకు తెచ్చారు. ఇది మచ్చుకే.
అసలు సాక్షి టీవీ, పేపర్ లో వచ్చే ఒక్క వార్తకు కూడా ఆధారం ఇదని అమర్ చెప్పగలరా..? మరి గురవింద గింజ లాగా నీతులు వల్లించడం ఎందుకు. ఇదీ పక్కన పెడతాం. అమరావతిలో పెద్ద స్కాం జరిగిందని అందులో పవన్ కళ్యాణ్ కు భాగం ఉందంటూ కథనాలు రాశారు కదా..? దానికి సాక్ష్యం చూపించాలని ఇదే అమర్ సాక్షి మీడియాను అడగగలడా..?
జర్నలిజాన్ని నమ్ముకొని విలువల కోసం పని చేస్తున్న జర్నలిస్ట్ ఎన్ని కష్టాలు పడుతుంటారో అందరికీ తెలుసు. కానీ జర్నలిజం ముసుగులో బతికేవాళ్లు దాన్ని అమ్ముకుంటూ వెల్ సెటిల్ అయ్యారు. ఇందులో అగ్రగణ్యుడు దేవులపల్లి అమర్ అంతే సందేహం లేదేమో. ఆయన ఇప్పుడు వెల్ సెటిల్డ్. ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము రూ. 5 లక్షల వరకూ ఖాతాలో వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు దేవులపల్లి.
తర్వాతి క్షణం ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఎవరి కోసమైతే ఆరోపణలతో బాధితుల్ని చేశారో.. వారి చేతికి అధికారం వస్తే రాళ్లేసిన వారిని వదిలేస్తారని.. జర్నలిజం ముసుగులో తలదాచుకోవచ్చని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఎందుకంటే.. ఓ రిటైర్డ్ సీనియర్ జర్నలిస్టును వాట్సాప్ ఫార్వార్డ్ కేసులో అరెస్ట్ చేస్తే దేవులపల్లి ప్రభుత్వాన్ని సమర్ధించిన మాటలు.. ఎవరు మర్చిపోతారు.