
Aryan Khan : అర్యన్ ఖాన్ సెలబ్రిటీ కుటుంబం.. హీరో షారూఖ్ ఖాన్ కుటుంబం. ఇటీవల ఓ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతూ దొరికి అడ్డంగా బుక్కయ్యాడు. కటకటాల పాలయ్యాడు. కొన్నాళ్లు జైలు జీవితం అనుభవించాడు. రేవ్ పార్టీలు, గర్ల్ ఫ్రెండ్స్, లేట్ నైట్ పార్టీలు, తన పేజ్ 3 లైఫ్ పై కూడా గతంలో అర్యన్ పై వార్తలు వచ్చాయి. సెలబ్రిటీ కుటుంబాల్లో ఇలాంటివి కామనే అయినా అర్యన్ పై కొంత ఎక్కువగా వార్తలు వచ్చాయి.
అయితే అర్యన్ ఖాన్ విషయంలో సహకరించేందుకు రూ. 25 కోట్లు డిమాండ్ చేసి ఉచ్చులో చిక్కుకున్న ఎన్సీబీ(నార్కోటిక్ కంట్రోల్ బోర్డు) అధికారి సమీర్ వాంఖడే ఇతర అధికారితో పంచుకున్న చాట్ ఒకటి తాజాగా బయటకొచ్చింది. జ్ణానేశ్వర్ సింగ్ అనే మరో అధికారి ఈ చాట్ ను బయటకు వదిలినట్లు సమాచారం. సెలబ్రిటీల పిల్లలను ఎలా టార్గెట్ చేస్తుందో డ్రగ్స్ మాఫియా అందులో వివరించారు. అర్యన్ ఖాన్ లాంటి సెలబ్రిటీల పిల్లలకు డ్రగ్స్, సెక్స్ పిల్స్ సరఫరా అవుతాయని పేర్కొన్నారు. అయితే ఇందులో అర్యన్ ఖాన్ ఓ బ్రాండ్ అంబాసిండర్ అందరికీ ఈ రేవ్ పార్టీల టికెట్లు పంపేవాడని తెలిపారు. వీరి సాయంతోనే డ్రగ్ మాఫియా తన నెట్వర్క్ ను విస్తరిస్తుందని అందులో తెలిపారు..
ఏదేమైనా అర్యన్ ఖాన్ అంశం దేశవ్యాప్తంగా సంచలనమైంది. తండ్రి షారూఖ్ ఖాన్ కూడా జైలులో ఉన్న కొడుకును చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అర్యన్ ఖాన్ లైఫ్ స్టోరీపై కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. గౌరీ ఖాన్ కూడా జైలుకు వెళ్లి అర్యన్ ను పరామర్శించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అర్యన్ బెయిల్ పై విడుదలయ్యాడు.