36.1 C
India
Saturday, May 4, 2024
More

    Hardik Pandya : పాండ్యా కోసం ముంబై రూ.100 కోట్లు చెల్లించిందా? బంగారుబాతు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు

    Date:

    Hardik Pandya
    Hardik Pandya

    Hardik Pandya : ఐపీఎల్.. ప్రపంచ క్రికెట్ లో ఈ లీగ్ కు ఉన్నంత క్రేజ్ దేనికీ లేదు. దాదాపు లీగ్ చుట్టూ లక్ష కోట్లకు పైగా బిజినెస్ జరుగుతుందంటే ఐపీఎల్ సత్తా ఏంటో చూపుతోంది. ప్రపంచ క్రికెట్ ఆగ్రశ్రేణి ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొని తహతహలాడుతుంటారు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అంతర్జాతీయ టోర్నీలతో దేశం కోసం ఆడడం కంటే ఐపీఎల్ లో ఆడితేనే వారికి ఎక్కువ రొక్కం ముడుతోంది. ఫ్యాన్స్ కూడా ఐపీఎల్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ లీగ్ జరిగే  నెలన్నర రోజులు క్రికెట్ ఫ్యాన్స్ కు అందులోనే లీనమై ఉంటారు. మస్తు మజా చేస్తుంటారు.

    అందుకే ఈ లీగ్ లో తమ టీం గెలవాలని జట్టు యాజమాన్యాలు కోరుకుంటాయి. ఆటగాళ్లను ఎంత ధర చెల్లించైనా కొనాలని చూస్తుంటాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా ట్రాన్స్ ఫర్ అయిన విషయం తెలిసిందే. పాండ్యా ముంబైకి ఆడించడానికి ఆ యాజమాన్యం చెల్లించిన ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే. అక్షరాల వంద కోట్ల రూపాయలు. ఒక్క ఆటగాడికే వంద కోట్లు చెల్లిస్తున్నారంటే అతడెంత విలువైన ఆటగాడో తెలుస్తోంది. ఇప్పుడు అంతట దీని గురించే చర్చ నడుస్తోంది. పాండ్యా బంగారు బాతు కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    ‘‘హార్దిక్  పాండ్యా ఎంఐకి వెళ్లిపోయేందుకు గుజరాత్ టైటాన్స్ ఎందుకు అంగీకరించింది?’’ అనే హెడ్ లైన్స్ తో రీసెంట్ గా ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించినట్లు క్రికెట్ గురించి అప్ డేట్లు అందించే ఎక్స్ యూజర్ ముఫద్దాల్ వొహ్రా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

    ఈ వోహ్ర చేసిన పోస్టుకు ఇప్పటికే ఐదు లక్షలకు పైగా వీక్షించారు. అయితే ఈ విషయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా కోసం 100కోట్లు చెల్లించాల్సిన పని లేదని.. ఇలాంటివి కేవలం హైప్ తెచ్చేందుకుకే క్రియేట్ చేస్తారని కొందరు ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం హార్దిక్ బంగారు బాతు లాంటివాడు.. అతడి కోసం ముంబై రూ.100కోట్లు పెట్టినా.. అందుకు రెట్టింపు పైసా వసూల్ ప్రదర్శన ఇస్తాడు.. అని కామెంట్స్ పెడుతున్నారు.

    ఇదిలా ఉండగా.. గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాకు గతంలో కెప్టెన్ గా పనిచేసిన అనుభవం లేకున్నా.. పూర్తి ఫిట్ నెస్ లేకున్నా.. అతడిపై నమ్మకంతో కొనుగోలు చేసింది. అయితే వారు అనుకున్నట్టుగా ఆరంగ్రేట సీజన్ లోనే టైటాన్స్ ను విజేతగా నిలిపాడు. ఈ ఏడాదికి ఫైనల్ కు తీసుకొచ్చాడు. అయితే అనూహ్యంగా ముంబై ఇండియన్స్ తో ఒప్పందం కుదుర్చుకుని టైటాన్స్ కు టాటా చెప్పాడు. రోహిత్ శర్మ స్థానంలో ముంబైకి కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు మాత్రం ఇది సహించలేకపోతున్నారు. ఆ జట్టును వారు బ్యాన్ చేస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీ లేకుంటే తాము జట్టును ఫాలో కాబోమని మండిపడుతున్నారు. మరి హార్దిక్ ముంబై అభిమానులను మెప్పిస్తారా? లేదా అనేది చూడాలి మరి.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...