36.5 C
India
Friday, April 10, 2026
More

    వరుణుడొచ్చినా ‘పవను’డేడి..

    Date:

    • సినిమా షూటింగ్లకే పరిమితమయ్యాడని విమర్శలు
    Varuna and pawan
    pawan

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరే సపరేటు. సినిమా రంగంలో ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉన్నా, రాజకీయాల్లో మాత్రం ఆయన ఇంకా ఓనమాలే నేర్చుకుంటున్నారు. రాజకీయాన్ని ఆసాంతం ఒంటపట్టించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో తిరుగుతున్నా ఆయనకు మాత్రం అది ఎక్కడం లేదు.  ఆయన బుధవారం తూర్పు గోదావరి జిల్లా పర్యటన విమర్శలకు కేంద్ర బిందువైంది. తెలుగు రాష్ర్టాల్లో వర్షం బీభత్సం సృష్టించి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలో దాని తీవ్రత ఎక్కువగానే ఉంది.

    షూటింగ్ గ్యాప్ లో రాకపై విమర్శలు..

    జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన మహారాష్ట్రలో చిత్రీకరణలో పాల్గొంటున్నారు. రైతులు పంటలు నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే, ఓ పార్టీ అధినేతగా పవన్ దూరంగా ఉండడం ఈ విమర్శలకు కారణమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తూ.గో జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. రైతులను ఆదుకోవాలని ఏకంగా వైసీపీ ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. లేకుంటే ఆందోళనలు చెపడుతామని హెచ్చరించారు. కానీ పవనుడి జాడ లేదు. వరుణుడొచ్చి ముంచెత్తినా పవనుడు వచ్చి పరామర్శించకపోవడం విమర్శలకు కేంద్ర బిందువైంది. షూటింగ్ గ్యాప్ లో వీలు చూసుకొని వచ్చి పరామర్శించడమేంటని చర్చ కొనసాగుతున్నది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే రైతులను ఆదుకునే చర్యలకు పూనుకుంది. ఇప్పుడు జనసేనాని రాకలో అంతర్యమేంటో తెలియడం లేదని పలువురు మాట్లాడుకుంటున్నారు. అకాల వర్షం వచ్చి ముంచెత్తిన సమయంలో రాకుండా. పవనుడి ఈ అకాల రాక ప్రస్తుతం పలు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Poonam Kour fire: పవన్ కళ్యాణ్ పై పూనమ్ ఫైర్.. ఆయన హిందుత్వం విషయంలో సంచలన వ్యాఖ్యలు..

    Poonam Kour fire: తెలుగు సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు,...

    Rain Effect: మరో ఆరు రోజులు ఇదే పరిస్థితి.. తెలుగు రాష్ట్రాలకు తీవ్ర వర్ష గండం..

    Rain Effect: రెండు రోజులుగా తీవ్ర వర్షం కురుస్తుండడంతో రెండు తెలుగు...

    PAK Vs BAN :రెండో టెస్టులో పాక్ బ్యాటర్లను కట్టడి చేసిన బంగ్లా.. ఘోర ఓటమి తప్పదా?

    PAK Vs BAN : పాకిస్థాన్, బంగ్లాదేశ్ ల మధ్య రెండో టెస్టు...

    Pavan Kalyan : బాల‌య్య 50 ఏళ్ల వేడుకకు హాజరుకానున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

    Pavan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ...