Ghosts : చీకటిని చూసి జడుసుకుంటే చెట్టే చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది. గుండెంటూ కలిగి ఉంటే అదే సైన్యమై నీ వెంట నిలుస్తుందన్నారు కవి అలిశెట్టి ప్రభాకర్. ఆశ అల్సర్ ఉన్నోడిని కూడా బతికిస్తుంది. భయం క్యాన్సర్ ఉన్నోడిని చంపేస్తుంది. రాత్రి పూట మనం ఒంటరిగా వెళితే భయం వేయడం ఖాయం. కానీ ఇక్కడో భయం కలిగించే సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
అదో పార్క్. ఉన్నట్లుండి రాత్రి సమయంలో పార్కులో జిమ్ పరికరం ఎవరో జిమ్ చేస్తున్నట్లు ఊగడం ప్రారంభించింది. ఇది చూసిన వాచ్ మెన్ నైట్ డ్యూటీ పోలీసులకు ఫోన్ కొట్టాడు. మా పార్కులో దెయ్యం జిమ్ చేస్తోంది సార్ అంటూ సమాచారం చేరవేశాడు. దీంతో వారు వచ్చి చూసేసరికి జిమ్ పరికరం వేగంగా ఊగుతోంది. దీంతో అందరు జడుసుకున్నారు.
అసలు జిమ్ పరికరం ఎందుకు ఊగుతోంది. దెయ్యం వచ్చి ఊపుతోందా? పోలీసులే ఏదైనా చేశారా? అంటే ప్రత్యక్ష సాక్షులే ఉన్నారు. జిమ్ పరికరం తనంతట తానే వేగంగా ఊగుతోంది. దాని ఊగుడుకు అందరు భయం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందనే దానిపై క్లారిటీ లేదు. ఇంతకీ దెయ్యం ఉన్నట్లా? లేనట్లా? అందరు ఊగుతుంది దెయ్యమే అంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త సంచలనం కలిగిస్తోంది. దెయ్యం ఉందా? లేదా? అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు ఎక్స్ లో కూడా ఈ విజువల్ తెగ వైరల్ గా మారుతోంది. దీంతో ఇది దెయ్యం పనా? లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అనే సందేహాలు వస్తున్నాయి. ఇది ఇంకా ఎన్ని సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుందో చూడాల్సిందే.