
Causes of red eyes : సాధారణంగా కళ్లు తెల్లగా ఉంటాయి. కానీ అందులో ఏదైనా పడితే ఎర్రగా మారతాయి. దీంతో చూడ్డానికి రక్తం పడినట్లుగా అనిపిస్తాయి. ఇలా అయినప్పుడు వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే సరి చేసుకోవాలి. ఇలా కళ్లకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. నిరంతరం చూసుకుంటూ ఉంటే నష్టమే వస్తుంది.
కళ్లు ఎర్రబడటానికి చాలా కారణాలుంటాయి. అందులో దుమ్ము, పొగ పడొచ్చు కనురెప్పకు ఏదైనా దెబ్బ తాకడం వంటి వాటి వల్ల కనుగుడ్లు ఎర్రగా మారతాయి. కళ్లు ఎర్రగా అయినప్పుడు తక్షణమే వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. సరైన చికిత్స తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులొస్తాయి.
కంటిలోని చిన్న రక్తనాళాలు ఎర్రబడినప్పుడు లేదా నాళాలు వాపునకు గురైనప్పుడు ఈ సమస్య వస్తుంది. కళ్లు ఎర్రబడటానికి కంటిలో చికాకు, తగినంత నిద్ర లేకపోవడం, కంటిపై ఒత్తిడి పడటం వంటి కారణాల వల్ల కూడా కళ్లు ఎర్రబడతాయని చెబుతున్నారు.
ఈ సమస్యకు కలబంద ఉపయోగపడుతుంది. కళ్లు ఎర్రబడితే అందులో కలబంద రసం కంటిపై ఉంచితే ఫలితం కనబడుతుంది. కళ్ల మంటలు తగ్గించడానికి కూడా ఇది సాయపడుతుంది. ఇలా మన కళ్లు ఎర్రబడితే కలబంద మనకు రక్షణ కల్పిస్తుంది. ఇలా మన కంటి జబ్బులను నయం చేసుకోవచ్చు.