
US Citizens Indians Position : అమెరికాలో నివసించే వారిలో అక్కడి పౌరసత్వం పొందుతున్న వారిలో భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. 2022లో మెక్సికో తరువాత అత్యధిక మంది అక్కడి పౌరసత్వం పొందారు. ఆ ఏడాదిలో 65,960 మంది అక్కడి పౌరసత్వం పొందినట్లు తెలుస్తోంది. అమెరికాలో 2022 నాటికి 4.6 కోట్ల మంది విదేశీయులున్నారు. 33.3 కోట్ల మంది అక్కడ ఉన్నారు.
వీరిలో 2.45 కోట్ల మంది ఆ దేశ పౌరులుగా గుర్తింపు పొందారు. ఆ ఏడాదిలో 9,69,380 మంది అమెరికా పౌరులుగా మారారు. 2022లో 1,28,878 మంది మెక్సికన్లు అమెరికన్ పౌరులుగా మారారు. తరువాత ఇండియా (65,960), పిలిప్పీన్స్ (53,413), క్యూబా (46,913), డొమినికల్ రిపబ్లిక్ (34,525), వియత్నాం (33,246), చైనా (27,038) ఉన్నాయి.
భారత్ కు చెందిన వారు అమెరికా పౌరసత్వం (US Citizenship) తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. 42 శాతం మంది అక్కడి పౌరసత్వం తీసుకుంటున్నారంటే అక్కడి జీవితానికే అలవాటు పడుతున్నారు. 2023 నాటికి గ్రీన్ కార్డు లేదా లీగల్ పర్మినెంట్ రెసిడెన్సీ ఉన్న వారు 2,90,000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా అమెరికాలో స్థిరపడే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది.
అమెరికా పౌరసత్వం కోసం వచ్చిన దరఖాస్తుల్లో 2023 నాటికి 4,08,000 గా ఉన్నట్లు నివేదకలు వెల్లడిస్తున్నాయి. 2023లో కొత్తగా 8,23,702 మంది ఎల్ పీఆర్ ఉన్న వారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 90 లక్షల మంది దానికి అర్హత ఉన్నప్పటికి తక్కువ సంఖ్యలోనే అప్లికేషన్లు రావడం గమనార్హం.
రోజురోజుకు మనదేశంలో ఉండాలనే కాంక్ష తగ్గిపోతోంది. అమెరికాలోనే స్థిరపడాలని కోరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం అక్కడ ఉన్న అవకాశాలే. మనదేశంలో లేని అవకాశాలు అక్కడ ఉండటంతోనే చాలా మంది అమెరికా వెళ్లి అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో మన దేశ జనాభా కాస్త అక్కడ స్థిరపడిపోతోంది.