39.4 C
India
Monday, April 29, 2024
More

    God Movie Review : గాడ్ మూవీ రివ్యూ.. జయం రవి, నయన్ మెప్పించారా?

    Date:

    God Movie Review
    God Movie Review

    God Movie Review :
    నటీనటులు : నయనతార జయం రవి వినోద్ కిషన్ రాహుల్ బోస్ నరైన్ ఆశీష్ విద్యార్థి తదితరులు
    డైరెక్టర్ : ఐ అహ్మద్
    నిర్మాత : జెరీష్ రాజా
    మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా

    వైజాగ్ లో ఏసీపీగా పని చేసే అర్జున్ విధినిర్వహణలో నిజాయితీగా ఉంటాడు. అర్జున్ కు ప్రియా (నయనతార) గర్ల్ ఫ్రెండ్.. అర్జున్ ను తన ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసిన తనకు వివాహం చేసుకునే ఉద్దేశం లేదని రిజక్ట్ చేస్తాడు.. ఇక స్మైలీ సీరియల్ కిల్లర్ బ్రహ్మ (రాహుల్ బోస్) ప్రజలను వరుస హత్యలు చేస్తూ భయ పెడుతుంటాడు. దీంతో ఈ సైకో కిల్లర్ ను పట్టుకోవడానికి అర్జున్ రంగంలోకి దిగుతాడు.

    మరి ఇతడిని ఎలా పట్టుకుంటాడు? అమ్మాయిలను అంత పాశవికంగా ఎందుకు చంపుతాడు? బ్రహ్మ సైకో కిల్లర్ గా మారడానికి కారణం ఏంటి? ఇటు ప్రియను పెళ్లి చేసుకోవడానికి అర్జున్ ఎందుకు నిరాకరించాడు? ప్రియా అర్జున్ తీరుపై ఎలా స్పందిస్తుంది? అనే కోణంలో ఈ కథ సాగుతుంది..

    ఈ సినిమా వరుస హత్యలతో అత్యంత ఎమోషనల్ గా మొదలవుతుంది.. అర్జున్ ఎంట్రీతో ఈ మూవీ పూర్తిగా యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. దీంతో ఆడియెన్స్ లో ఈ సినిమాపై క్యూరియాసిటీ బాగా పెరుగుతుంది. అలాగే ప్రియతో  రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి.. రొమాంటిక్ సీన్స్ నుండి సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది.. సీరియస్ మోడ్ నుండి ఎంటర్టైన్మెంట్ మోడ్ లోకి వెళ్లినట్టు అనిపిస్తుంది.

    అత్యంత కిరాతకంగా హత్యలు చేస్తున్న బ్రహ్మ కిల్లింగ్ సన్నివేశాలు మితిమీరినట్టు అనిపిస్తుంది. సీరియల్ కిల్లింగ్ అనే సింగిల్ పాయింట్ తో కథ మొత్తం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక నటీనటులు పెర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకుంది.. అర్జున్ పాత్ర ఫుల్ పవర్ఫుల్ గా సాగుతుంది.. నయన్ కేవలం గెస్ట్ అప్పీరియన్స్ మాదిరిగానే తన పాత్ర ఉంది. బ్రహ్మ రోల్ లో రాహుల్ బోస్ తన రోల్ తో భయపెట్టాడు.

    మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అద్భుతంగా నడిపించాడు.. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.. మితిమీరిన హింస, రక్తపాతం ఇబ్బందిగా భయపెట్టే విధంగా ఉంటాయి..

    Share post:

    More like this
    Related

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    Top Heroine : ఈ అమ్మడుని గుర్తుపట్టారా.. తెలుగు లో ఒకప్పటి టాప్ హిరోయిన్ నేటి జంతు సంరక్షురాలు

    Telugu Top Heroine : సినిమాల్లో టాప్ హిరోయిన్లుగా వెలుగొందిన ఒకప్పటి...

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related