21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Dimple Hayati Petition : డింపుల్ హయతి పిటిషన్ పై హైకోర్టు విచారణ.. ఏం తేల్చి చెప్పిందంటే?

    Date:

    Dimple Hayati petition
    Dimple Hayati petition, TS High Court

    Dimple Hayati petition : తెలుగు హీరోయిన్ లలో డింపుల్ హయతి ఒకరు.. విజయవాడకు చెందిన ఈ బ్యూటీ ‘గల్ఫ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఖిలాడీ, రామబాణం తదితర సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించింది. తెలుగు అమ్మాయి అయినా కూడా ఈమె ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలను ఆరబోసి హాట్ హీరోయిన్ గా పేరు సంపాదించు కుంది.

    అసలు ఈమె మెగా హీరో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమాలోని ఐటెం సాంగ్ తో పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ తోనే ఈ అమ్మడు కూడా టాలీవుడ్ లో ఉంది అని అందరికి తెలిసింది.. మరి కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడిప్పుడే నిలబడుతున్న క్రమంలో ఈమెపై కేసు నమోదు అవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

    అప్పటి నుండి మీడియా ఈమె వివాదం విషయంలో ఫోకస్ పెట్టింది. ఇలా ఈ భామపై కేసు నమోదు అవ్వడం కెరీర్ కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఈమె ఏకంగా రాహుల్ హెగ్డే అనే పోలీస్ అధికారితో వైరం పెట్టుకుంది. ఆ విషయంలో ఆ అధికారి విధులకు ఆటంకం కలిగించే విధంగా తన కారుకు అడ్డంగా పార్కింగ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తుంది అనే ఆరోపణలతో ఈమెపై కేసు వేసాడు.

    డింపుల్ ఇది తప్పుడు కేసు అని ఆరోపిస్తూ కేసు వేసిన పోలీసులు తీసుకోలేదు.. అప్పటి నుండి పోలీసులపై రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న ఈ భామ ఇటీవల పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని డింపుల్  హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపింది..

    ఆమెకు సిఆర్పీసీ 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని పోలీసులు నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సూచించింది. నిందితుడిగా ఉన్న డేవిడ్ కు కూడా నోటీసులు ఇవ్వాలని నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dimple Hayati : పెళ్లయిన హీరోతోనే ప్రేమాయణం సాగిస్తున్న హీరోయిన్.. ఎంతకీ వదలట్లేదట

    Dimple Hayati : ప్రస్తుతం డింపుల్ హయాతి తెలుగులో అవకాశాల కోసం ఎదురు...

    Dimple Hayati : డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు నమోదు.. కారణం ఏంటంటే..?

    Dimple Hayati : తెలుగు హీరోయిన్ లలో డింపుల్ హయతి ఒకరు.....