
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం. దీంతో కడుపులో ఏదో తిప్పుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏ పని చేయబుద్ధి కాదు. మనసంతా కడుపు మీదే ఉంటుంది. ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన తరువాత మనం మలవిసర్జన చేయకపోతే మన చూపంతా కడుపు మీదే పెడతాం. ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తుంటాం. ఇది మలబద్ధకం సమస్య ఉన్నవారికి. ఆ సమస్య లేని వారు అలా వెళ్లి ఇలా వస్తారు. దీంతో మలవిసర్జన సాఫీగా ఉండకపోతే కడుపునొప్పి వస్తుంది.
మలబద్ధకం సమస్యకు చక్కని చిట్కాలు ఉన్నాయి. దీంతో బాధపడే వారికి ఓక్లీలు మంచి ఆహారం. వీటిని ఉదయం పూట అల్పాహారంలో తీసుకోవడం వల్ల మంచి లాభాలు ఉన్నాయి. ఇవి మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. పేగుల్లో కదలికలు తెస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది. మన ఆహారంలో భాగంగా వీటిని చేర్చుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
వీటిని టిఫిన్ గా తీసుకోవచ్చు. గంజిలా మార్చుకోవచ్చు. ఎలా తీసుకున్నా మనకు తిన్న వెంటనే మలవిసర్జన చేసే వీలుంటుంది. ఇలా ఓక్లీలు మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి దూరం కావచ్చు. వయసు పైబడిన వారిలో మలబద్ధకం సమస్య అధికంగా కనిపిస్తుంది. అందుకే వారు ఎక్కువగా ఇలాంటి వాటిని తీసుకోవడం ఉత్తమం.






