Hyundai New Cars : కార్ల కొనుగోలులో వేగం పెరిగింది. చాలా మంది కార్లు కొంటూ తమ సదుపాయాలు పెంచుకుంటున్నారు. ఫిబ్రవరిలో హ్యుందాయ్ కొత్త రకం కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్, హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ ఐ10, హ్యుందాయ్ వెన్యూ, హ్యుందాయ్ వెర్నా, హ్యుందాయ్ అల్కా జార్, హ్యుందాయ్ టుస్కాన్ వంటి అనేక రకాల మోడళ్లు వస్తున్నాయి.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ సీఎన్ జీ వేరియంట్ల పై ప్రయోజనాలు చెల్లుబాలయ్యే విధంగా పీచర్స్ రూపొందించబడ్డాయి. పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లకు క్యాష్ డిస్కౌంట్ రూ. 15 వేలకు తగ్గించింది. ఏఎంటీ వేరియంట్ల కోసం ఇది రూ. 5 వేలకు తగ్గించారు. హ్యందాయ్ గ్రాండ్ 10 నియోస్ ధర రూ. 5.92 లక్షల నుంచి రూ.8.56 లక్షల మధ్య ఉంది.
మరో మోడల్ హ్యుందాయ్ ఆరా. మాన్యువల్ ఆటోమేటిక్ అన్ని పెట్రోల్ వేరియంట్లకు నగదు తగ్గింపు రూ. 5 వేలకు తగ్గించింది. హ్యుందాయ్ ఆరా సబ్ 4మీ సెడాన్ ను రూ.6.49 లక్షల నుంచి రూ. 9.05 లక్షల వరకు పలుకుతోంది. హ్యుందాయ్ ఆరా సీఎన్జీ వేరియంట్లు వర్తిస్తాయి.
హ్యుందాయ్ ఐ 20 పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ల ఆఫర్ ఎంచుకున్న వేరియంట్ ను బట్టి మారవచ్చు. 20 యొక్క సీవీటీ వేరియంట్లతో ఎటువంటి తగ్గింపు ఉండదు. హ్యుందాయ్ ఐ20 ధర రూ. 7.04 లక్షల నుంచి రూ.11.21 లక్ష ల వరకు ఉంది. హ్యుందాయ్ ఐ20 యొక్క పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లు రూ. 15 వేలు తగ్గింపు ఉంటుంది.