36.1 C
India
Saturday, May 4, 2024
More

    India vs Pakistan : ఆసియా కప్ లో మనమెక్కడ?

    Date:

    India vs Pakistan :
    ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ మజాయే వేరు. కప్ రాకపో యినా ఫర్వాలేదు కానీ మ్యాచ్ మాత్రం గెలవాలనే ఉత్కంఠ అందరిలో ఉంటుంది. దానికి అనుగుణంగా రెండు దేశాల క్రికెటర్లు హోరాహోరీగా పోరాడుతూనే ఉంటారు. చివరి బంతి వరకు రసవత్తరంగా మారుతుంది మ్యాచ్. ఆసియా కప్ లో భాగంగా శ్రీలంక వేదికగా శనివారం సెప్టెంబర్ 2న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.

    దీంతో ఇందులో ఎలాగైనా విజయం సాధించాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. ప్రేక్షకులకు తమ కానుక ఇవ్వాలని అనుకుంటున్నాయి. దీని కోసం రెండు దేశాలు సై అంటే సై అంటున్నాయి. ఆసియా కప్ లో రెండు దేశాలు ఎన్ని సార్లు పాల్గొన్నాయి. ఎవరిది పైచేయిగా నిలిచింది. ఎవరు విజయం సాధించారనే అనుమానాలు అందరికి రావడం సహజమే. దీంతో వాటి వివరాలు తెలుసుకుందాం.

    భారత్, పాకిస్తాన్ తొలిసారిగా బెలూచిస్తాన్ లో క్వెటా వేదికగా 1978లో వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు రెండు దేశాల మధ్య 132 మ్యాచ్ లు జరగగా 73 మ్యాచుల్లో పాకిస్తాన్ 55 మ్యాచుల్లో ఇండియా విజయం సాదించాయి. నాలుగు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. దీంతో వారిదే పైచేయిగా ఉంది.

    ఆసియా కప్ టోర్నీలో 1984లో షార్జాలో జరిగిన తొలి మ్యాచ్ లో పాక్ ను 54 పరుగుల తేడాతో ఓడించింది. చిరకాల ప్రత్యర్థి మీద కసి తీర్చుకుంది. ట్రోఫీని సైతం కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 46 ఓవర్లకు కుదించడతో భారత్ 188 పరుగులు చేసింది. ఓపెనర్ ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ సురీందర్ ఖన్నా 56 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన వాడిగా నిలిచాడు.

    రెండేళ్లకోసారి నిర్వహించే ఈవెంట్లో 1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018లలో భారత జట్టు విజేతగా నిలిచింది. పాకిస్తాన్ ఇప్పటి వరకు 2000, 2012లో రెండుసార్లు మాత్రమే చాంపియన్ గా గెలిచింది. 2000 ఫైనల్లో శ్రీలంక 39 పరుగులు, 2012లో బంగ్లాదేశ్ ను 2 పరుగులతో ఓడించి చాంపియన్ గా అవతరించింది. టీమిండియా ఆరు వన్డేలు, ఒక టీ 20 ట్రోఫీలు గెలుచుకుంది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Weather Updates : మండే వేసవిలో కూల్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువేనట..

    Weather Updates : ఈ సారి (2024) ఎండ వేడిమి విపరీతంగా...