Sushmita Sen : కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. మనిషిలో బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యమే గొప్పదని మాజీ విశ్వ సుందరి సుస్మితాసేన్ అభిప్రాయం. మనం కాబోయే జీవిత స్వామి విషయంలో ఏం కోరుకుంటాం. మంచి మనసు అని చాలా మంది చెబుతుంటారు. కానీ అందం విషయంలో తప్పటడుగు వేస్తారు. అందం మనిషిని వెర్రి వాణ్ణి చేస్తుంది. బాగా ఆకర్షణగా కనిపిస్తే అన్ని మరిచిపోయి అందానికే దాసోహం అంటారు.
అందంగా ఉన్న వారికి అందమైన మనసు ఉండదు. వారితో సమస్యలే ఎక్కువ. అందాన్ని కోరుకుంటే అన్ని బాధలు తెచ్చుకున్నట్లే. అందమైన వారికి అందమైన మనసు ఉండదనేది నిత్య సత్యం. దీంతో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో ఏకాకిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అందం తెచ్చే బాధలు తీవ్రంగా ఉంటాయి.
అందమైన మనసు ఉన్న జీవిత భాగస్వామి అయితే మనల్ని అర్థం చేసుకుంటుంది. మన పనుల్లో తోడుగా నిలుస్తుంది. మన బాధల్లో అండగా ఉంటుంది. జీవితాంతం మనల్ని అంటి పెట్టుకుంటుంది. మనకు ఏదైనా బాధ కలిగితే తను విలవిలలాడుతుంది. అదే నిజమైన భార్యంటే. కానీ అందమైన భార్య కావలని అనుకుంటే జీవితం బుగ్గిపాలే. నిరంతరం కష్టాలతో కాపురం చేయాల్సి వస్తుంది.
బ్యూటీఫుల్ వైఫ్ ఈజ్ డేంజరస్ లైఫ్ అంటారు. వ్యక్తిత్వం కంటే గుణానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆమెలో మంచితనం ఎంత ఉందనేది చూడాలి. మంచిలక్షణాలుంటే తప్పకుండా మంచి ఇల్లాలుగా మారుతుంది. కానీ అందమే కావాలంటే ఆకర్షణకు గురవుతారు. మంచి భార్య కావాలంటే లక్షణాలు చూడాలి. దీంతో మన జీవితం నందనవనంలా అవుతుంది.