
KCR is alone : థర్డ్ ఫ్రెంట్ అంటూ గొప్పలకు పోయిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒంటరి అనే సంకేతాలు వస్తున్నాయి. బీజేపీ గద్దె దించడమే లక్ష్యంగా థర్డ్ ఫ్రెంట్ పని చేస్తుందని అందుకు అందరూ కలిసి రావాలని కోరాడు. కూటమి కట్టాలని ఇటు కుమారస్వామి, స్టాలిన్, మాయవతి, కేజ్రీవాల్ ఇలా అందరినీ కలిసి వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఒంటరిగానే మిలిగిపోయారు. ఆయనను ప్రస్తుతం ఎవరూ పిలవడం లేదు. థర్డ్ ఫ్రంట్ వద్దనుకున్న బీజేపీ వ్యతిరేక నాయకులు కాంగ్రెస్ తో కలవాలని కానీ థర్డ్ ఫ్రెంట్ అంటూ ఏమీ ఉండదని తేలిపోయింది.
కేంద్రంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు పలు అంశాల్లో పోరాడుతున్నాయి. అందులో ఒకటి ఢిల్లీ అధికారాలను తగ్గించే ఆర్డినెన్స్.. రెండోది పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం. వీటిపై బీజేపీ వ్యతిరేక పార్టీలు కలిసికట్టుగా పోరాడుతున్నాయి. ఈ పోరాటాలే విపక్ష కూటమికి ఆజ్యంపోసేలా కనిపిస్తుంది. కానీ ఇందులో కేసీఆర్ మాత్రం కనిపించడం లేదు. బీజేపీని ఓడించడం, గద్దె దించడం ఇదే పరమావధి అని పెట్టుకున్న తెలంగాణ సీఎం ప్రత్యేక హెలీకాప్టర్ ఏర్పాటు చేసుకొని మరీ వివిధ రాష్ట్రాలు తిరిగివచ్చారు. కానీ ఈ మధ్య ఆయన స్తబ్దంగా ఉండిపోయారు.
బీజేపీపై పోరు సాగించేందుకు కేసీఆర్ ఇంట్రస్ట్ చూపించకపోవడంతోనే ఇతర పార్టీల నేతలు ఆయనను పిలవడం లేదని తెలస్తోంది. విపక్ష కూటమిని ఏకం చేయాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ తరుచూ విపక్ష నేతలను కలుసుకొని చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను కూడా కలుస్తానని చెప్తున్నారే తప్ప కలువడం లేదు. నితీశ్ కుమార్ ను కలిసేందుకు కేసీఆర్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. రీసెంట్ గా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కేసీఆర్ కు ఆహ్వానం అందలేదు. దీనికి తోడు స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలకూ ఆహ్వానం అందలేదు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరూ నమ్మడం లేదని, అందుకే జాతీయ రాజకీయాల్లో ఆయన ఒంటరిగా మిగిలిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.