KTR : రాజకీయాలంటే నైతిక విలువలుండాలి. ప్రజలతో సంబంధాలు ఉండే వ్యవహారాలు. అందరి కళ్లు రాజకీయాలపైనే ఉంటాయి. వారి ప్రవర్తన వేయి కళ్లతో పరిశీలిస్తారు. అలాంటి రంగంలో ఉన్న వారు హుందాగా ఉండాలి. రాజకీయాలకు అర్థం చెప్పేలా వారి ప్రవర్తన ఉండాలి. కానీ చిన్న పిల్లల్లా పరాచికాలు ఆడే విధంగా ఉండకూడదు. వారి మాటలు అందరు గమనిస్తారు. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి.
గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ ప్రజల్లో చులకన అయిపోతున్నారు. రాజకీయాలన్నాక చాలా మందితో మాట్లాడాల్సి ఉంటుంది. చాలా వ్యవహారాలుంటాయి. అది కేటీఆర్ కు తెలియంది కాదు. వారు పదేళ్లు అధికారంలో ఉన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తే ఒప్పుకునేవారా?
ఆ కులాన్ని ఏదో అన్నారు. ఈ కులంపై అసభ్య పదజాలం ఉపయోగించారంటూ కేటీఆర్ రోజుకో వర్గాన్ని రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇది ఆయన స్థాయికి సరికాదు. చిన్న పిల్లాడి మాదిరి ఆయన చేష్టలుంటున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న వారి మీద బురద జల్లే పని మానుకోవాలి.
లేదంటే ఆయన ప్రతిష్ట మసకబారి కేటీఆర్ మనుగడకే ముప్పు ఏర్పడుతుంది. ప్రతిసారి ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకుని సద్విమర్శలు చేయడం నేర్చుకుంటే మంచిది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు అధికారానికి దూరం చేసినా వారిలో మార్పు రాకపోవడం వారి దౌర్భాగ్యం. ఇక వారి మానసిక స్థితి మారదని కొందరు ప్రతి విమర్శలు చేస్తుండటం గమనార్హం.