
Buffaloes on the AC floor : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా మహేష్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈయన చార్మింగ్ లుక్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. 47 ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం చరిష్మా తగ్గకుండా మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు.. ఏజ్ పెరిగే కొద్దీ ఎవ్వరికైనా అందం తగ్గిపోతుంది.. కానీ మహేష్ బాబుకు మాత్రం ఏజ్ పెరిగేకొద్దీ అందం కూడా పెరుగుతుంది..
గత పదేళ్ల క్రితం మహేష్ ఎలా ఉన్నాడో అంతకంటే చార్మింగ్ లుక్ లో ఇప్పుడు దర్శనం ఇచ్చాడు.. మరి ఇంత అందాన్ని కాపాడాలి అంటే అందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. మహేష్ కూడా అలానే అన్ని జాగ్రత్తలు పాటిస్తారు.. మరి తాజాగా వైరల్ అవుతున్న ఒక విషయం విని అంతా ఆశ్చర్య పోతున్నారు.
ఈయన ఎంతో సున్నితంగా ఉంటారు అనే విషయం తెలిసిందే.. అందుకే మహేష్ ఎండలో సినిమాలు చేయడం ఆపేశారట.. కానీ రాజమౌళి సినిమాలు అంటే అన్నిటికి భిన్నంగా ఏ కాలాన్ని అయిన తట్టుకుని నిలబడాలి.. అందుకే ఈయనతో సినిమా అంటే అది కూడా అడవుల బ్యాక్ డ్రాప్ లో అంటే ఎలా తట్టుకుంటాడో అని ఫ్యాన్స్ సైతం ఆలోచిస్తున్నారు.
ఈ క్రమంలోనే మహేష్ ను కష్టపెట్టకుండా రాజమౌళి ఆర్టిఫియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తాడని టాక్.. 360 డిగ్రీలలో మహేష్ ఫోటోలను తీసుకుని ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారట.. దీనిని ఎలా తీయనున్నారో అనే దానిపై నెట్టింట ఒక ఉదాహరణ కూడా వైరల్ అయ్యింది.
మహర్షి సినిమాలో బాగా ఎండలో మహేష్ తో ఒక సన్నివేశం చేయాల్సి ఉండగా అందుకు మహేష్ ససేమిరా అన్నారట.. దీంతో వంశీ పైడిపల్లి AC ఫ్లోర్ లో సెట్స్ వేసి గేదెలను కూడా అక్కడికే తెచ్చి షూట్ చేశారట.. ఈ విషయం విన్నవారంతా ఆశ్చర్య పోతున్నారు..