
Male prisoners : రష్యా జైళ్లలో దారుణంగా లైంగికదాడులు, చిత్రహింసలు ఉంటాయి. అవి ఎలా చేస్తుంటారో మాజీ ఖైదీలు బీబీసీతో మాట్లాడారు. గతేడాది ఒక ఖైదీ లీక్‌చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఏం జరిగింది, తాము న్యాయం కోసం ఎలా పోరాడుతున్నాం అనే విషయాలను వారు వెల్లడించారు. నైరుతి రష్యాలోని సరటోవ్ ఖైదీల హాస్పిటల్ కు సంబంధించిన కొన్ని లైంగిక వేధింపుల ఫొటోలు, వీడియోలు గతేడాది ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యాయి. వీటిని మొదట మానవ హక్కుల సంస్థల నిర్వాహకులు చూశారు. ఆ తర్వాత అంతర్జాతీయ మీడియాలో వీటిపై వార్తలు వచ్చాయి.
అలెక్సీ మకరోవ్ ఒక ఖైదీ 2018లో ఈ జైలుకు బదిలీ చేసినప్పుడే ఆయనకు ఈ జైలు గురించి పూర్తిగా తెలుసు. ఆరు నెలల జైలు శిక్షలో భాగంగా ఆయనను తీసుకచ్చారు. సరటోవ్ జైలుతో పాటు ఈ ప్రాంతంలోని మరిన్ని జైళ్లలోని ఖైదీల ఫిర్యాదులు తరుచూ వస్తుంటాయి. అయితే వైద్యం చేస్తామని ఖైదీలను ఇక్కడకు తీసుకువచ్చి చిత్రహింసలు పెడుతుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఆ దేశం జైళ్లను పర్యవేక్షించే వ్యవస్థ లేదు. ఖైదీల హాస్పిటల్స్, క్వారంటైన్ నిబంధనలు ఇక్కడ ఎవరూ పట్టించుకోరు.
మకరోవ్‌కు క్షయ (టీబీ) సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ జైలులోనే తనను వదిలిపెడతారని ఆయన అనుకున్నాడు. అయితే, తనపై రెండుసార్లు లైంగికదాడి చేశారని ఆయన ఏడుస్తూ చెప్పాడు. ఈ లైంగిక హింస, వేధింపులపై జైలు అధికారులందరికీ తెలుసని అయినా పట్టించుకోరని చెప్తున్నారు. నేరాలను ఒప్పించేందుకు, బ్లాక్ మెయిల్ కోసం, భయపెట్టేందుకు ఇలాంటి విధానాలను ఎంచుకుంటారని బాధితులు అంటున్నారు.
వరుసగా లైంగిక దాడులు, చిత్రహింసల ఫొటోలు, వీడియోలు ఇంటర్ నెట్ లో ఉండడంతో రష్యా తప్పక స్పందించాల్సి వచ్చింది. ఆ దేశంలో 90 శాతం ప్రాంతాల్లో 2015 – 2019 మధ్య ఖైదీలను చిత్ర హింసలు పెట్టారని రష్యా స్వతంత్ర మీడియా ప్రాజెక్ట్ ‘ప్రోయెక్ట్’ అధ్యయనంలో వెల్లడైంది. దీనిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కోర్టులు విడుదల చేసిన వేల పత్రాలను అధ్యయనం చేయగా..
మొదటి సారి ఫిబ్రవరి 2020లో మకరోవ్‌ను చిత్రహింసలు పెట్టారు. అధికారులపై ఓ కుట్రను పన్నాడన్న నేరం ఒప్పుకొనేందుకు నిరాకరించడంతో వేధించారని చెప్పారు. ‘ముగ్గురు పురుషులు నాపై వరుసగా అత్యాచారాలు చేశారు’ అని మకరోవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మొదట పది నిమిషాలపాటు బాగా కొట్టారు. ఆ తర్వాత బట్టలను విప్పేశారు. రెండు గంటలపాటు నాపై లైంగిక దాడులు జరిగాయి’. అంటూ రోధించాడు. ‘నీరసంతో పడిపోయినప్పుడు.. చల్లని నీరు ముఖంపై కొట్టేవారు. మళ్లీ టేబుల్‌పైకి తీసుకొచ్చి లైంగికదాడి చేసేవారు’ అని ఆయన వివరించారు. రెండు నెలల తర్వాత మళ్లీ లైంగికదాడి జరిగిందని ఆయన చెప్పాడు.
‘నాపై దాడిచేసిన వారికే నేను 735 పౌండ్లు (రూ.71,405) ఇచ్చేలా ఒప్పించారు. బయటకు చెప్పవద్దని కూడా మరోసారి అత్యాచారం చేశారు’. ‘లైంగికదాడులను వీడియోలుగా చిత్రీకరించారు. అధికారులు చెప్పినా దానికి అంగీకరించకపోతే, ఈ వీడియోలను అందరికీ చూపిస్తామని బెదిరించేవారు’. ‘ఇక్కడ లైంగికదాడులు చేసేవారు కూడా తోటి ఖైదీలే. వారికి ఇష్టం లేకున్నా జైలు అధికారులు చెప్పినట్లు చేసేవారు’ అని ఆయన వెల్లడించారు. అరుపులు, కేకలు బయటకు వినిపించకుండా మ్యూజిక్ పెద్దగా పెడతారని మకరోవ్ తెలిపారు.