
2016లో మౌనిక బెంగుళూరుకు చెందిన గణేష్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరికి కుదరకపోవడంతో కోర్టు అనుమతితో విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు రైరవ్ ను చూసుకుంటానని మనోజ్ చెప్పడంతో పెళ్లి చేసుకునేందుకు ఆమె మొగ్గు చూపినట్లు సమాచారం. అందుకే మనోజ్ కొడుకును ప్రేమగా చూసుకుంటున్నాడని చెబుతున్నారు.
రైరవ్ తన పెట్ డాగ్ తో ఆడుకుంటున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మనోజ్ సిల్వర్ స్ర్కీన్ లో కనిపించి ఐదేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలకు విరామం ఇచ్చి సంసార సుఖాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరికొన్ని ప్రాజెక్టులు లైన్లో ఉండటంతో ఇక సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
పిల్లవాడితో మనోజ్ కు చిన్ననాటి నుంచే అనుబంధం ఉందని తెలుస్తోంది. మనోజ్ ఏడాదిన్నర పాటు చెన్నైలో ఉన్నాడట. ఆ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు వారిద్దరి వీడియో ఒకటి సంచలనం సృష్టిస్తోంది. వారి మధ్య ఉన్న అనుబంధంతోనే మౌనిక మనోజ్ ను ఇష్టపడింది. అందుకే వారి మధ్య అంతటి ప్రేమ ఉందని తెలుస్తోంది.