Minister Roja :
మంత్రి రోజా ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలు ఇప్పుడు ఏపీని, జనసేను అతలాకుతలం చేస్తున్నాయి. గతంలో జనసేన పార్టీకి చెందిన ఒక నాయకురాలు ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి వల్లే తాము ఓడిపోయామని చెప్పిందని ఈ విషయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇలాంటి స్టేట్ మెంట్లను సొంత పార్టీ నాయకులే ఇస్తుంటే పవన్ కళ్యాణ్ ఏం పీకుతున్నారని రోజా నిలదీసింది. అన్న చిరంజీవితో పాటు తల్లిపై కూడా పార్టీ నాయకులు ఇష్టం వచ్చిన్నట్లు అవాక్కులు, చెవాక్కులు పేలుతుంటే ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అంటూ మండిపడ్డారు.
ఈ రోజు పవన్ కళ్యాణ్ సినిమాల్లో గానీ, రాజకీయాల్లో గానీ ఈ స్థాయిలో ఉన్నారంటే అది చిరంజీవి పెట్టిన భిక్షనే అన్నారు రోజా. ఆయనే లేకుంటే పవన్ కళ్యాణ్ అనేవాడే లేడని, ఆయనపైనే ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నాడని మండి పడ్డారు ఆమె. నీతిమాలిన వారు అన్న బాలకృష్ణ లాంటి వారికి ఇంటర్వ్యూలు ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను మోసం చేస్తున్నారని రోజా అన్నారు. పవన్ కళ్యాణ్ చిరంజీవితో పాటుు తన తల్లికి కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చిరంజీవి వల్ల పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ నాశనం అయ్యింనది సొంత పార్టీ నాయకులే చెప్పడం విడ్డూరంగా ఉన్నా.. ఇందులో మాత్రం ఎటువంటి నిజం లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు చిరంజీవి తన తమ్ముడి వెనకే ఉంటానని చెప్పారు. ఎవరికీ మద్దతిచ్చేది లేదని తన తమ్ముడినే గెలిపించుకుంటానని చెప్పారు. ఈ విషయం మరి పార్టీ నాయకులకు తెలియదా? అన్న సందేహం ఇప్పుడు ఏపీ ప్రజలకు కలుగుతుంది. గతంలో పార్టీ పెట్టిన చిరంజీవి ప్రత్యర్థుల వాగ్ధాటికి తట్టుకోలేక పార్టీని కాంగ్రెస్ లో కలిపి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో చిరు ఎటువైపు అన్న వార్తలకు స్పందనగా ఆయన తన తమ్ముడివైపు అని బాహాటంగానే ప్రకటించారు.
చిరంజీవి వల్ల పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు నాశనం అయ్యిందట : రోజా#RKRoja #YSRCP #cmysjagan #MegastarChiranjeevi #PawanKalyan #JanaSenaParty #NTVTelugu pic.twitter.com/QTv5pDbeR8
— NTV Telugu (@NtvTeluguLive) July 19, 2023
https://twitter.com/NtvTeluguLive/status/1681594993465790464?s=20