
Pawan with Ram Charan : పవన్ కల్యాణ్ పేరు వింటేనే చాలు కుర్రాళ్లంతా ఊగిపోతుంటారు. ఆయన కనిపిస్తే చాలు అనుకునే వారు కోకొల్లలుగా ఉంటారు. అయితే పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలతో పాటు రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటున్నారు. అయితే తాజాగా ఆయన ఇటలీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ పెండ్లి వేడుక కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ వెళ్లింది.
వరుణ్ తేజ్ తాను ప్రేమించిన లావణ్యను పెళ్లాడాడు. ఇక ఈ వేడుకకు ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మాత్రమే వెళ్లాయి. అయితే ఈ పెండ్లికి సంబంధించిన చాలా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ మొదట ఈ ఫొటోల్లో ఎక్కడా కూడా పవన్ కల్యాణ్ కనిపించలేదు.
కానీ తాజాగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన రెండు ఫొటోలు బయటకు వచ్చాయి. మొదటి దాంట్లో పవన్ కల్యాణ్ తన అన్న నాగబాబు పక్కన నిలబడ్డ ఫొటో బ్యాక్ నుంచి కనిపించింది. అయితే తాజాగా మరో ఫొటో ఈ వేడుక నుంచి బయటకు వచ్చింది. ఇందులు రామ్ చరణ్ తో కలిసి పవన్ కల్యాన్ కనిపించాడు. ఇందులో వీరిద్దరూ నవ్వుతూ కనిపించారు.
ఇంకేముంది ఈ ఫొటో చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అసలైన వేడుకు అంటే ఇది కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటో చాలు మాకు అంటూ కామెంట్లు పెడుతున్నారు మెగా ఫ్యామిలీ అభిమానులు. ఇక నేడు ఇటలీ నుంచి ఇండియాకు మెగా ఫ్యామిలీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.