
Bramham gari Kalagynam : ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్ గద్దె దించి అధికార మార్పుకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన సమావేశంలో పవన్ ఈ మేరకు స్పందించారు.
రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాన ధ్యేయమని చెప్పారు. కార్యకర్తలు దీనికి సన్నద్ధంగా ఉండాలని చెబుతున్నారు. అధికారంలోకి రావాలంటే అందరు కష్టపడాలని సూచించారు. ఈనేపథ్యంలో జనసేన పార్టీ దూసుకుపోతోంది. గతంలో పవన్ సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో కూడా పవన్ కల్యాణ్ ప్రముఖ పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయన జనసేన పార్టీ స్థాపించి ముందుకు వెళ్తున్నారు.
వైసీపీపై విమర్శలు పెరుగుతున్న క్రమంలో రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికే గోల చేస్తున్నాయి. ఇదే అదనుగా అధికారం చేపట్టాలని జనసేన ఉవ్విళ్లూరుతోంది. అందుకే తమకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఉత్సాహ పడుతున్నారు. భవిష్యత్ లో అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.
అప్పుడెప్పుడో బ్రహ్మంగారు కాలజ్ణానం రాశారు. అందులో పవన్ కల్యాణ్ సీఎం అవుతారని ఉందని ఓ పేజీ సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇంతకీ పవన్ కల్యాణ్ కు ఇది కలిసొచ్చే అంశమేనా? నిజంగా పవన్ సీఎం అవుతారా అనేది చూడాల్సిందే. మొత్తానికి ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలో దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది.