
Poonam : పూనమ్ బజ్వా 2005లో ‘మొదటి సినిమా’ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
తెలుగులోనే కాక మలయాళం, కన్నడం, తమిళం చిత్రాల్లో నటించింది.
పూనమ్ కు మోడలింగ్ రంగం లో కూడా ప్రవేశం ఉంది. తెలుగులో 2006లో హీరో నాగార్జున సరసన ‘బాస్’ మూవీ లో హీరోయిన్ గా చేసింది.
2008 లో డైరెక్టర్ హరి దర్శకత్వంలో వచ్చిన మంచి మసాలా చిత్రం గా గుర్తింపు పొందిన ‘సెవల్’ చిత్రంతో తమిళంలో అరంగేట్రం చేసింది.
ఆ తర్వాత ‘తెనావట్టు’, ‘తంబికోట్టై’, ‘ద్రోహి’, ‘కచేరి అరంబం’ వంటి తమిళ చిత్రాల్లో నటించింది.
మలయాళ చిత్రమైన ‘చైనా టౌన్’ లో కూడా నటించి మెప్పించింది.
బొంబాయిలో నేవీ ఆఫీసర్ ఐన అమర్ జిత్ సింగ్ బజ్వా, జయలక్ష్మీ బజ్వా దంపతులకు పూనమ్ జన్మించింది.
పూనమ్ కు దీపికా బజ్వా అనే చెల్లె కూడా ఉంది. పూనమ్ చిన్నతనం నుండి మోడలింగ్ పై ఆసక్తి కనబరిచేది. చదువుకునే సమయంలో మోడలింగ్ చేయడం ప్రారంభించింది.
‘మిస్ పూణె’ కిరీటాన్ని 2005 లో కైవసం చేసుకుంది. ఆ క్రమంలో ఒకసారి హైదరాబాద్ లో ర్యాంప్ షో లో పాల్గొన్న పూనమ్ ను చూసిన ‘మొదటి సినిమా’ దర్శకుడు తన సినిమా లో నటించాలని కోరాడు.
అప్పుడు ఆమె 12వ తరగతి చదువుతుంది. కాలేజీలో కొంత విరామం దొరకడంతో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకుంది.
సినిమాల్లో నటిస్తూ కూడా సింబయాసిస్ ఇంటర్నేషనల్ విశ్వవిద్యాలయం, పూణే నుండి ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ పట్టా పొందింది.