
Rapaka son marriage : రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఈయనే. ఆ తర్వాత అధికార వైసీపీలో కి జంప్ అయ్యారు. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకున్నా ఆ పార్టీ నేతగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల అత్యుత్సాహంతో నోరు జారి విమర్శల పాలయ్యారు. తాను దొంగ ఓట్లతోనే గెలిచానని మాట్లాడి వార్తల్లో నిలిచారు. ఏకంగా ఎన్నికల సంఘం కూడా విచారణ జరపాలని కలెక్టర్ ను ఆదేశించింది. మరోవైపు తనకు టికెట్ ఇచ్చి రాజకీయాల్లో అవకాశం కల్పించిన పవన్ కల్యాణ్ పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ జగన్ ప్రసన్నం కోసం పాకులాడి జనసైనికుల కోపానికి కారణమయ్యాడు.
అయితే రాపాక వరప్రసాద్ కుమారుడి జూన్ 7న ఉంది. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన పత్రిక నెట్టింట వైరల్ గా మారింది. వైస్ జగన్- భారతమ్మల ఆశీర్వాలతో పెండ్లి అంటూ వారి ఫొటోలతో పెండ్లి పత్రికను రాపాక అందరికీ పంచుతున్నారు. దీనిని చూసిన వారు జనసేనలో గెలిచి వైసీపీ పాట అంటూ చెవులు కొరక్కుంటున్నారు. మరికొందరు అతిభక్తి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే పెండ్లి పత్రిక బాగుందని, అన్నావదినల ఫొటోలతో నిండుగా కనిపిస్తున్నదని సోషల్ మీడియాలో ట్వీట్స్ పోస్టులు పెడుతున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల కంటే ఈ జనసేన ఎమ్మెల్యే ఒక ఆకు ఎక్కువే చదివారని, ఎన్నికల వేళ జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి మంచి ప్లాన్ వేశాడని అంటున్నారు. ఏదైమైనా రాపాక వరప్రసాద్ నాగరత్నమ్మల కుమారుడి వివాహ పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది. మరి జూన్ 7 ఒంటి గంటకు అతిథులందరూ రావాలని వారు పిలుపునిస్తున్నారు.