
Rashmika reacted : ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.. ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట మరో రకంగా వైరల్ అవ్వడంతో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఐశ్వర్య రాజేష్ తమిళ్, మలయాళం, హిందీ సినిమాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈమె తెలుగమ్మాయి అయిన అవకాశాలు మాత్రం శూన్యం.. లేడీ ఓరియెంటెడ్ మూవీ కౌసల్య కృష్ణమూర్తి వంటి మంచి సినిమాతో ఈమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఇక ఆ తర్వాత ఐశ్వర్య విజయ్ దేవరకొండతో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించి మెప్పించిన కూడా ఈమెకు మరో అవకాశం రాలేదు.
అందుకే ఈమె తమిళ్ లోనే సినిమాలు చేసుకుంటుంది.. తాజాగా ఈమె నటించిన ఫర్హానా సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చింది.. తెలుగులో సినిమాలు ఎందుకు చేయడం లేదో చెప్పుకొచ్చింది. అలాగే ఈ సందర్భంగా రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర గురించి కూడా వ్యాఖ్యానించింది.. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర లాంటి పాత్రలు తనకు బాగా సెట్ అవుతాయని చెప్పింది.
కానీ శ్రీవల్లి పాత్రని తాను రష్మిక కంటే బాగా చేసేదాన్ని అంటూ ఈమె అన్నట్టు రాయడంతో ఇది కాస్త వైరల్ అయ్యింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ తాను అలా అనలేదు అంటూ మరో లేఖ విడుదల చేసింది.. ఈ విషయంపై తాజాగా రష్మిక కూడా స్పదించి ” నీవు ఏం చెప్పావో నేను అర్ధం చేసుకున్నాను.. మనకు మనం వివరణ ఇచ్చుకోవడానికి ఎలాంటి కారణాలు లేవు.. నీవంటే నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయనేది నీకు తెలుసు” అంటూ స్వీట్ రిప్లై ఇవ్వడంతో ఇక్కడితో ఈ సమస్యకు ఎండ్ కార్డు పడింది..