37.8 C
India
Friday, May 3, 2024
More

    YS Sharmila : షర్మిల పయనమెటు.. కాంగ్రెస్ తో కొలిక్కిరాని చర్చలు

    Date:

    YS Sharmila:
    YS Sharmila:
    YS Sharmila: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలకు ధీటుగా అధికార పార్టీపై పోరాడుతున్న వైఎస్సార్టీపీ అధినేత షర్మిల పరిస్థితి గందరగోళంగా మారింది. కాంగ్రెస్ లో పార్టీ విలీనం లేదా పొత్తు అంటూ మొన్నటి వరకు మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.  తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు ఆమె చేరికను వ్యతిరేకిస్తుండగా, మరికొందరు స్వాగతిస్తున్నారు. అయితే ఆ చర్చలు ఇంకా కొలిక్కి రావడం లేదు.
    అవి ఎక్కడ ఆగిపోయాయో, ఎందకు ఆగిపోయాయో కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి గానీ షర్మిల నుంచి క్లారిటీ రావడం లేదు
    రాజన్న రాజ్యం తెస్తానంటూ మాజీ సీఎం వైఎస్సార్ కూతురు షర్మిల తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా తన కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన ప్రతిక్షాలకు ధీటుగా విమర్శలు గుప్పించారు. పాదయాత్ర చేసి ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేశారు. ప్రజల్లో ఉంటూ కేసీఆర్ కుటుంబ పాలనపై విరుచుకుపడుతున్నారు. అయితే తెలంగాణలో ఎన్నికలు సమీపించగా ఆమె ప్రస్తుతం తన ఉనికిని చాటుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు.
    కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. బెంగుళూరు వెళ్లి అక్కడి డిప్యూటీసీఎం శివకుమార్ ను కలవడం, రాహుల్ తో భేటీకోసం ఢిల్లీ కూడా వెళ్లారు. అంతకు మంచి ఒక్క అడుగు కూడా ముందు పడినట్లు కనిపించడం లేదు.
    పాలేరు నుంచి బరిలో..
    పార్టీ ప్రారంభించిన నాటినుంచి ఆమె ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ప్రకటించారు.  కాంగ్రెస్ పొత్తు లేదా విలీన చర్చల నేపథ్యంలో ఆమెను ఏపీకి పంపాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే తాను మాత్రం తెలంగాణలోనే ఉంటానని తన వైఖరిని స్పష్టం చేశారని సమాచారం.  ఒకవేళ చర్చలు సఫలమై షర్మిల తెలంగాణలోనే ఉంటే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే చర్చ మొదలైంది.  అయితే బీఆర్ఎస్ లో టికెట్ రాకపోవడంతో ఖమ్మం జిల్లాకు చెందిన నాగేశ్వర్రావు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాను పాలేరు నుంచి బరిలో ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. షర్మిల కాంగ్రెస్ లోనే ఉంటే పాలేరు నుంచి పోటీ చేస్తారా లేక స్థానం మార్చుకుంటారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తుమ్మల పాలేరు నుంచి బరిలో ఉండడం నిలవడం ఖాయం. అయితే ప్రస్తుతం షర్మిల పరిస్థితి ఏమిటన్నది పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతున్నది.

    Share post:

    More like this
    Related

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    Telangana : తెలంగాణలో వడగాలులు.. 4వ తేదీ వరకు బీ అలర్ట్

    Telangana : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో...

    Victory Venkatesh : ఖమ్మంలో ప్రచారం చేయనున్న విక్టరీ వెంకటేష్?

    Victory Venkatesh : ఖమ్మం నియోజకవర్గానికి గ్లామరస్ మేకోవర్ రాబోతోంది! 2024...