27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Dr. Jai Yalamanchili : ‘ఎస్పీ బాలు’ లైఫ్ టైం అవార్డ్ అందుకున్న యూబ్లడ్ అధినేత ‘డా.యలిమంచిలి జగదీష్ బాబు’

    Date:

    ఎస్పీ బాలు జీవిత సాఫల్య అవార్డును అందుకొని ప్రసంగిస్తున్న డా.యలిమంచిలి జగదీష్ బాబు
    ఎస్పీ బాలు జీవిత సాఫల్య అవార్డును అందుకొని ప్రసంగిస్తున్న డా.యలిమంచిలి జగదీష్ బాబు

    Dr. Jai Yalamanchili : ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జీవిత సాఫల్య పురస్కారాన్ని యూబ్లడ్ అధినేత డా. యలిమంచిలి జగదీష్ బాబు గారు అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక లైఫ్ టైం అవార్డ్ అవార్డును తాజాగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు. జగదీష్ గారితోపాటు పలువురు ప్రముఖులకు ఈ అవార్డు అందజేశారు..

    ‘కళాదర్భార్ ఆంధ్రప్రదేశ్ మరియు ది ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో కీ.శే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 77వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు 4వ తేదీన ఆదివారం సాయంత్రం గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎస్పీ బాలు 77వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే పలు రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులకు లైఫ్ టైం అవార్డ్ అందించారు. యూబ్లడ్ తో విశేష సేవలందిస్తున్న డా. జగదీష్ బాబు గారికి ఈ అవార్డును అందించారు.

    ఎస్పీ బాలు జీవిత సాఫల్య పురస్కార సభలో డా. యలిమంచిలి జగదీష్ బాబు
    ఎస్పీ బాలు జీవిత సాఫల్య పురస్కార సభలో డా. యలిమంచిలి జగదీష్ బాబు

    ఈ సందర్భంగా పలు రంగాల్లోని ప్రముఖులు, సేవాతత్పరులకు ఈ ‘ఎస్పీ బాలు జీవిత సాఫల్య పురస్కారాలను ప్రధానం చేశారు. ఇందులో ప్రముఖంగా యూబ్లడ్ అధినేత డా. యలిమంచిలి జగదీష్ బాబు గారికి ఈ లైఫ్ టైం అవార్డ్ ను అందజేయడం విశేషం.

    యూ బ్లడ్ ద్వారా ఎంతో మందికి రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను జగదీష్ గారు కాపాడారు. ఇప్పటికీ సమాజంలోని ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఈయన సేవలను గుర్తించిన ది ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ ఈ సందర్భంగా లైఫ్ టైం అవార్డును జగదీష్ గారికి ప్రకటించింది.

    ఈ సందర్భంగా యూబ్లడ్ అధినేత డా. యలిమంచిలి జగదీష్ బాబు గారు మాట్లాడుతూ.. సమాజానికి ఎంత సేవ చేస్తే అంతగా మనకు తిరిగి వస్తుందని.. అందరూ సమాజ సేవలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్పీ బాలు గారి ఈ జీవిత సాఫల్య అవార్డును అందుకోవడం గర్వకారణంగా భావిస్తున్నట్టు తెలిపారు.

    ఇక ఈ కళాదర్భార్ ఆంధ్రప్రదేశ్ ఎస్పీ బాలు జయంతిని ‘కళా సామ్రాట్ పొత్తూరి రంగారావు గారు నిర్వహించారు. ఆత్మీయ అతిథులుగా లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్, పొతూరి నాగభూషణం, వంశీ రామరాజులు పాల్గొన్నారు.

    ఇక ఎస్పీ బాలు జీవిత సాఫల్య అవార్డులను డా. యలిమంచిలి జగదీష్ బాబు గారితోపాటు శ్రీనివాస్, శివలెంక కృష్ణ ప్రసాద్, శ్యామూల్ రెడ్డి, రవిచంద్ర, రాజ్ కుమార్ పడయార్, రసూల్ బాబు, శ్రీమతి శైలజలు అందుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dr. Jai Yalamanchili : సాయంలో కర్ణుడు.. సేవలో మేరునగధీరుడు.. డా.జై

    UBlood Founder Dr. Jai Yalamanchili Garu : పువ్వు పుట్టగానే...

    Rahul Gandhi : అమెరికాలో రాహుల్ గాంధీ సమావేశానికి హాజరైన యూబ్లూడ్ ఫౌండర్ డాక్టర్ జై

    Rahul Gandhi :కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ప్రస్తుతం...