
NTR favorite dish : నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శత జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహనీయుడిని గుర్తు చేసుకోని వారు ఉండరంటే సందేహం లేదు. ఆయన జయంతి నాడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. కొంత మంది ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటే మరికొందరు ఆయనకు ఇష్టమైన ఫుడ్ ను గుర్తు చేసుకుంటున్నారు.
హైదరాబాద్ లోని ఒక రెస్టారెంట్ ఆయనను స్మరించుకుంటోంది. ఆయన ఎక్కువ ఇష్టంగా తినే ఆహార పదార్థాలను మెనూలో చేర్చింది. శక పురుషుడి జ్ఞాపకార్థం అంటూ మెనూ తయారు చేసింది. నందమూరి తారక రామారావు అభిమానులు, సిటీ ప్రజలు ఎక్కువగా అక్కడికి వస్తున్నారు. లెజెండ్ యాక్టర్, మాజీ సీఎంను స్మరించుకుంటున్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కు చెందిన ‘ద స్పైసీ వెన్యూ’ అనే ఫుడ్ రెస్టారెంట్ ఆంధ్ర వంటకాలను ఎక్కువగా సర్వ్ చేస్తుంది. అయితే ఈ రెస్టారెంట్ ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా స్పెషల్ ఫుడ్ ను మెనూలో చేర్చింది. ఈ వంటకాలు కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయని యజమానులు తెలుపుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ ఫెవరేట్ డిషెస్ ఉన్నాయి.
నాన్ వెజ్ లో ఎన్టీఆర్ స్పెషల్ కాంబినేషన్ ఇష్టపడేవారట. ఎలాగంటే ఫిష్ ఫ్రై పప్పుచారుతో కలిపి తీసుకునేవారట. అలాగే నాటుకోడి పులుసుతో గారెలు, నేతి పులావు విత్ మటన్ ఇగురు, అయితే బ్రేక్ ఫస్ట్ లో ఆయన ఎక్కువగా కాల్చిన నాటుకోడి ఉండేదట. పెరుగున్నం ఆవకాయ పచ్చడి, పాలతాలికులు, దీంతో పాటు స్పైసీ మిర్చీ బజ్జీ కొబ్బరి చెట్నీతో, తాటిముంజల కూర ఎక్కువగా ఇష్టంగా తినేవారట. రెస్టారెంట్ యజమాని సంపత్ తుమ్మల ఎన్టీఆర్ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడితన తర్వాతే ఈ డిసెష్ ను మెనూ ఉంచినట్లు చెప్తున్నారు.
సంపత్ తుమ్మల మాట్లాడుతూ ‘స్పైసీ వెన్యూ’ పూర్తిగా తెలుగు రెస్టారెంట్ అని, సిటీలోకి ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఇక్కడికి వస్తుంటారని, తెలుగు వంటకాలు రుచి చూసేందుకు కూడా చాలా మంది వస్తుంటారని, అయితే ఈ ఎన్టీఆర్ స్పెషల్ మాత్రం కొన్ని రోజులే ఉంటుందని, తాము కూడా మహా పురుషుడిని ఈ విధంగా స్మరించుకుంటున్నట్లు చెప్పారు.