Sr NTR Hundred Coins : నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావు పేరిట రూ. 100 నాణెన్ని ఈనెల 28న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయన పేరిట రూ. 100 నాణెన్ని ముద్రించింది. కాగా, ఈ నాణెన్ని ఈనెల 28న రాష్ర్టపతి ముర్ము చేతుల మీదుగా రాష్ర్టపతి భవన్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ర్టపతి భవన్ కార్యాలయం నుంచి ఈ మేరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి ఈ మేరకు ఆహ్వానాలు సిద్ధం చేయించి, పంపిస్తున్నారు.
అయితే ఈ నాణెంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో తయారు చేశారు. చారిత్రక ఘటనల ప్రముఖుల గుర్తుగా వెండి నాణెలు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తున్నది. మొదటిసారిగా జవహర్ లాల్ నెహ్రుది రిలీజ్ చేశారు. ఇక తెలుగు చలన చిత్ర రంగంలో మరెవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు అన్న ఎన్టీఆర్. రాజకీయ రంగంలోనూ రికార్డులను సృష్టించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరిటా 1982లో తెలుగు దేశంపార్టీని పెట్టి చరిత్ర సృష్టించారు. పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, రికార్డు విజయం సాధించారు. ప్రజాస్వామ పునరుద్ధరణ అంటూ ఆక్ష్న చేసిన పోరాటం చరిత్రలో మైలురాయిలా నిలిచింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.
ప్రస్తుతం ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి పలువురు ప్రముఖులకు ఈ ఆహ్వానాలు పంపిస్తున్నది. తన తండ్రి, గ్రేట్ లీడర్, లెజండరీ యాక్టర్ ఎన్టీఆర్ పేరిట విడుదల చేస్తున్న నాణెనికి సంబంధించిన కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నది.