27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Srikanth Addala : శ్రీకాంత్ అడ్డాల న్యూ మూవీ.. పస్ట్ లుక్ పోస్టర్ వేరే లెవల్..!

    Date:

    Srikanth Addala
    Srikanth Addala

    Srikanth Addala : ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందించిన ఆయన కొన్ని రోజులుగా సినిమాలు లేక వెండితెరకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఆయన తీసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఆయన కుంగిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన మరో సినిమా ‘నారప్ప’. తమిళ్ హిట్ మూవీ అసురన్ కు తెలుగు రీమేకే నారప్ప. అయితే కరోనా లాక్ డౌన్ కావడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకి విడుదల చేశారు.

    నారప్ప ఓటీటీలో ఒక మోస్తారుగా ఆడింది. లాక్ డౌన్ కొంచెం సడలడంతో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఓటీటీలో చూశామనో ఏంటో కానీ థియేటర్లలకు నారప్ప కలెక్షన్ లలో వెనుకబడిపోయింది. ఈ చిత్రమే శ్రీకాంత్ అడ్డాలకు చివరి చిత్రంగా ఉంది. అయితే ఆయన ఇప్పుడు కొంచెం తేరుకొని మరో సినిమా తీయాలని అనుకుంటున్నారట. దీని కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఈ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

    చాలా రోజుల గ్యాప్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల మరోసారి మెగాఫోన్ పట్టబోతున్నాడు. ఇటీవల అఖండ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై ఆయన ఓ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. జూన్ 2వ తేదీ ఉదయం 11.39 గంటలకు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ద్వారకా క్రియేషన్స్ సంస్థ ప్రొడక్షన్ నెం.4. ‘#PK1 – కుట్ర, విస్ఫోటనం అపూర్వం @srikanthaddalaa సినిమా. జూన్ 2న ఉదయం 11:39 గంటలకు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల వేచి ఉండండి!! @mravinderreddyy.’ అంటూ తెలిపింది.

    ప్రీ లుక్ పోస్టర్ లో రక్తపు మరకలతో ఉన్న చేయి కనిపిస్తుంది. మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయన బావమరిది ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడే వరకూ వేచి చూడాల్సిందే. ఈ సినిమా హిట్ కావాలని పూర్తి ఎఫర్ట్ పెట్టి తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Srikanth Addala : శ్రీకాంత్ అడ్డాలతో ఆ హీరోయిన్ కు ఎఫైర్: నటుడి స్పందన

    Srikanth Addala : తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న...

    Mega mass : అభిమానులకు మెగా మాస్ గిఫ్ట్.

    mega mass : ఆగస్టు 22 చిరంజీవి అభిమానులకు పండగ రోజు....

    Director Srikanth Addala : మరోసారి గోదావరి యాస..?

    Director Srikanth Addala : తెలుగు సినిమాలకు విచిత్ర  టైటిళ్లు పెట్టడం దర్శకుడు...