
Stolen property : ఎంత కసాయి వాడిలోనైనా ఎప్పుడో ఒకప్పుడు మార్పు రావడం ఖాయం. ఇది వృద్ధాప్యమా లేక యవ్వనమా.. అనేది అంటుంచితే.. ఇక్కడ ఒక దొంగలో కూడా మార్పు వచ్చింది. ఎంతలా అంటే కొన్నేళ్ల క్రితం ఆలయంలో చోరీ చేసిన నగలను తిరిగి ఆలయంలో పెట్టేశాడు. వీటితోపాటు లెటర్ కూడా పెట్టాడు. ఆ లెటర్ చదివిన ఆలయ సిబ్బంది షాక్ కు గురయ్యారు. ఇన్నేళ్లకు స్వామి వారి నగలు తిరిగి రావడంతో ఆనందించాలా లేక ఆశ్చర్యపోవాలో తెలియక సతమతం అయ్యారు.
ఒడిసాలోని భువనేశ్వర్ లో 2014లో రాధాకృష్ణ ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. ఇందులో పెద్ద మొత్తంలో ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఇది అప్పట్లో భువనేశ్వర్ తీవ్ర చర్చకు దారి తీసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని కొన్నేళ్లు వెతికారు.. అయినా పోయిన నగదు గానీ, నిందితుడిని గానీ కనుక్కోలేకపోయారు. ఆ దొండ కూడా ఒక్క ఆనవాలు లేకుండా చాక చక్యంగా నగలు ఎత్తుకెళ్లాడు. ఎలాంటి క్లూ కూడా పోలీసులకు వదిలి వెళ్లలేదు. కొన్నేళ్లు వెతికిన పోలీసులు ఎట్టకేలకు కేసును మూసి వేశారు.
ఇదే ఆలయం పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. అయితే ఆలయంలో 2014లో చోరీకి గురైన నగలు ప్రత్యక్షమయ్యాయి. ఇదంతా దేవుడి లీల అనుకుంటుండగా.. ఒక లెటర్ కనిపించింది. ఈ నగలను తానే చోరీ చేశానని.. అయితే ఇటీవల భగవత్ గీత చదివితే తనలో మార్పు వచ్చిందని, అందుకే నగలును ఆలయానికి తిరిగి ఇచ్చానని దొంగ లెటర్ లో పేర్కొన్నాడు. దీంతో అందరూ ఆశ్చర్య పోయారు. దాదాపు 9 సంవత్సరాలు ఆభరణానలు అమ్మకుండా, తాకట్టు పెట్టకుండా కాపాడి తిరిగి ఆలయానికి ఇవ్వడం, దొంగలో మార్పుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.