
మాంసాహారులకు ప్రొటీన్లు అధికంగానే అందుతాయి. శాఖాహారులకు ప్రొటీన్లు అందే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొన్ని ఆహారాలు ప్రత్యేకతంగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈనేపథ్యంలో శాఖాహారాలు తమ ఒంటికి మేలు చేసే వాటిని ఎంచుకోవడం ఉత్తమం. దీంతో ప్రొటీన్లు బలంగా ఉండే ఆహారాలను ఎంచుకుంటే మంచిది.
బ్రొకొలీలో ప్రొటీన్లు మెండుగా ఉంటాయి. అందుకే వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల బలం చేకూరుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫొలేట్, మాంగనీసు, పొటాషియం, పాస్పరస్, విటమిన్ కె,సి ఉండటంతో బ్రొకొలీ తీసుకోవడం వల్ల ప్రొటీన్లు పుష్కలంగా దక్కుతాయి.
శాఖాహారులు ప్రొటీన్ కోసం పచ్చి బఠాణీ తినడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. మాంగనీసు, కాపర్, ఐరన్, ఫొలేట్, జింక్, పొటాషియం అధికంగా ఉండటం వల్ల మంచి లాభాలుంటాయి. వీటిని సలాడ్లు, కూరలు, స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. ఇలా బఠాణీలతో అధిక శక్తి లభిస్తుంది. దీని వల్ల వీటిని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్వీట్ కార్న్ లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్లు సి, బి6, పొలేట్, మెగ్నిషియం, పాస్పరస్, మెగ్నిషియం వంటి పోషకాలు ఉన్నాయి. కాలీఫ్లవర్ లో కూడా మంచి ప్రొటీన్లు ఉన్నాయి. ఇందులో మాంగనీసు, పాస్పరస్, కాల్షియం, విటమిన్లు సి,కె పుష్కలంగా లభిస్తాయి. పాలకూరలో ప్రొటీన్లు బాగానే ఉంటాయి. అమైనో యాసిడ్స్, విటమిన్ ఎ, కె, సి వంటివి ఉండటంతో దీన్ని తీసుకుంటే ఎంతో మేలు.