35.9 C
India
Wednesday, May 1, 2024
More

    Star Heroes Wife’s : స్టార్ హీరోల భార్యలు కూడా తోపులే.. వారు ఏం చేస్తున్నారో తెలుసా?

    Date:

    Star Heroes Wife’s :

    ఏఎన్ఆర్, ఎన్టీఆర్ జమానాలో హీరోల సతీమణుల (భార్యల) గురించి అంతగా తెలిసేది కాదు. ఒక వేళ ఆమె హీరోయిన్ అయితే తప్ప. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిపోయింది. హీరోల భార్యల గురించే కాదు. వారి ఇంట్లో ఉన్న వస్తువుల గురించి కూడా మీడియాలో సమాచారం ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అందరు హీరోల గురించి తెలసుకుంటే చాటంత కావచ్చు కబట్టి కొంత మంది స్టార్ హీరోల భార్యల గురించి మాత్రమే ఇక్కడ తెలుసుకుందాం.

    హీరోల భార్యలు కూడా తమ బిజినెస్, చరిటీ గురించి వివరిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. ఇందులో ముందు వరుసలో ఉంది సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్. మహేశ్ బాబు ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆమె. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది. కానీ ఇండస్ట్రీని పూర్తిగా వదలిపెట్టలేదు. నమ్రత మహేశ్ ను బ్రాండ్ గా చూపిస్తూ ‘హంబుల్’ అనే టెక్స్ టైల్ ఇండస్ట్రీని మొదలుపెట్టింది. ఫాషన్ వేర్ తో పాటు ‘ఏఏంబీ మల్టీప్లెక్స్’లను స్థాపించింది నమ్రత. మహేశ్ బాబు ప్రొడక్షన్ హౌస్ పనులను కూడా ఆమే దగ్గరుండి చూసుకుంటుంది. వాటితో పాటు ‘మినర్వా’తో కలిసి రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేసింది.

    రామ్ చరణ్ భార్య ఉపాసన బిజినెస్ టైకూన్ అన్న సంగతి అందరికి తెలిసిందే. ఉపాసన అపోలో హాస్పిటల్స్ కు వైస్ చైర్మన్ గా ఉన్నారు. హాస్పిటల్ పనులతో పాటు ఫౌండేషన్ పనులు కూడా చూసుుంటుంది. ఎయిర్ లైన్స్ బిజినెస్ ను కూడా చక్కగా నిర్వహిస్తుంది.

    అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇనిస్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తుంది. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఎంబీఏ పూర్తి చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ నడపాలని ఆమె అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన చర్చల్లో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఛానల్ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    నాని భార్య అంజని రాజమౌళి ఆర్కా మీడియాలో క్రియేటివ్ హెడ్ గా రాణిస్తుంది. బాహుబలి మూవీకి ఆమె వర్క్ చేశారు. అల్లరి నరేశ్ భార్య ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేసి రన్ చేస్తుంది. యంగ్ బిజినెస్ ఉమెన్ గా కూడా ఈమె అవార్డులు అందుకుంది. వివిధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల భార్యలు కూడా పలు బిజినెస్ రంగాల్లో రాణిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Puri Jagannath Mahesh Babu మహేష్ బాబు, పూరీ మహేష్ మధ్య దూరం పెరగడానికి కారణం నమ్రతేనా?

    Puri Jagannath Mahesh Babu : పూరీజగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్...

    Varun Tej & Lavanya Tripathi : పెళ్లి కాకుండానే హనీమూన్.. ఆగలేకపోతున్నారుగా? అంటూ కామెంట్లు

    Varun Tej & Lavanya Tripathi : వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి...

    Rahul Ramakrishna : ప్రియదర్శితో నన్ను పోల్చకండి

    Rahul Ramakrishna : తెలుగులో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో ప్రియదర్శి...