39.5 C
India
Thursday, May 2, 2024
More

    Vivek Resigned : బ్రేకింగ్ : బీజేపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన వివేక్.. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

    Date:

    Vivek Resigned : బీజేపీకి పెద్ద షాక్. సీనియర్ నాయకుడు, ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ మార్పు ఊహించిందే. ఆయన ఎప్పుడు కూడా ఒక పార్టీలో ఉండరు. ప్రతి సారి ఏదో ఒక పార్టీలో చేరడం ఆయనకు అలవాటే. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీల్లో చేరారు. తరువాత పార్టీలు మారడం ఆయనకున్న అలవాటుగానే తెలుస్తోంది.

    ముందు నుంచే ఆయన పార్టీ మారతారనే వాదనలు వస్తున్నాయి. దానికి తోడు ఆయన సహజ గుణం బయట పెట్టుకున్నారు. వివేక్ తో పాటు ఆయన కుమారుడు వంశీ కూడా రాజీనామా చేయడం గమనార్హం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యాక కాంగ్రెస్ లో చేరతారనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణతోనే ఆయన పార్టీలో చేరుతున్నారని చెబుతున్నారు. కాసేపట్లో నోవోటెల్ హోటల్ లో రాహుల్ తో వివేక్, కొడుకు వంశీతో పాటు కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది.

    బీజేపీకి షాక్ లు తగులుతూనే ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చిన తరువాత పార్టీ అభాసుపాలవుతోంది. చాలా మంది నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. అసలు సంజయ్ ను ఎందుకు తొలగించారో కూడా తెలియదు. పార్టీకి మంచి నేతను దూరం చేయడంతో పార్టీ పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రస్తుతం పార్టీ రాష్టంలో మరింత దిగజారిపోయింది.

    వివేక్ తండ్రి వెంకటస్వామి కాంగ్రెస్ ఎంపీగా పలుమార్లు గెలిచారు. పార్టీలో మంచి స్థానం సంపాదించుకున్నారు. కానీ వివేక్ మాత్రం ఏ పార్టీలో కూడా సరిగా ఉండరు. ప్రతి ఎన్నికలకు పార్టీ మారడం ఆయనకున్న ప్రత్యేకత. ఇందులో భాగంగానే బీజేపీకి దూరమయ్యారనే వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డితో మాట్లాడాక పార్టీలో చేరే ముహూర్తం నిర్ణయించుకుంటారని సమాచారం.

    Share post:

    More like this
    Related

    Viral Video : రెచ్చిపోయిన వధువు.. వరుడినికాలితో తన్ని.. నానాయాగీ..

    Viral Video : పెళ్లి అర్థాలు, వేడకల తీరు పూర్తిగా మారిపోయింది....

    AP News : ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్లు – సీజ్ చేసిన పోలీసులు

    AP News : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 2.40...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    2nd Phase Polling : 2వ దశ పోలింగ్ నుంచి గేమ్ షురూ చేసిన బీజేపీ.. ఏం చేస్తుందంటే?

    2nd Phase Polling : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా 12...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Congress in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ కు అడ్వాంటేజ్.. రోజు రోజుకు బలహీన పడుతున్న బీఆర్ఎస్

    Congress in Telangana : చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని భారత...