Cameramen Gangatho Rambabu Vs Yatra 2 : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం మొదలైంది. జనాల్లోకి దూసుకెళ్లేందుకు ఎవరు వ్యూహాలు వారికి ఉంటాయి. కానీ కొంతమంది రాజకీయ పార్టీల సపోర్టర్లు మాత్రం తమ అభిమాన రాజకీయ పార్టీలకు భజన చేస్తూ సినిమాలు తీస్తున్నారు. అలాంటి సినిమాలలో ఒకటి ‘యాత్ర 2 ‘. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి. యాత్ర లాంటి హిట్ సినిమాకి సీక్వెల్, అందులోనూ సీఎం జగన్ లాంటి మాస్ లీడర్ బయోపిక్ కాబట్టి ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కుతాయని ఆశించారు ట్రేడ్ పండితులు. కానీ ప్రధాన నగరాల్లో కూడా ఈ సినిమాకి కనీస స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరగడం లేదు. గడిచిన 24 గంటల్లో ఈ సినిమాకి కేవలం ఆరు వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.
అయితే ఈ సినిమాకి పోటీగా ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి గడిచిన 24 గంటల్లో 8 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అంతే కాకుండా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం చేసిన రోజు అయితే ఏకంగా 10 వేలకు పైగా టిక్కెట్లు బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోయాయి. మొత్తం మీద ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 50 టిక్కెట్లు అమ్ముడుపోయ్యుంటాయని అంచనా. యాత్ర 2 చిత్రానికి అందులో ఒక్క శాతం కూడా లేకపోవడం గమనార్హం. కానీ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.
కొత్త సినిమా కాబట్టి అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా జరగకపోయినా, కౌంటర్ బుకింగ్స్ మాత్రం బలంగా జరుగుతాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఈ సినిమాలో సీఎం జగన్ పాత్రని తమిళ హీరో జీవా పోషించగా, ఆయన తండ్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రని మలయాళం మెగాస్టార్ మమ్ముటి పోషించాడు. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకుల మనసుల్ని కట్టిపారేస్తుంది అని ఒక టాక్ ఉంది, అది ఎంత వరకు నిజమో చూడాలి.