Lal Salaam Zero Share : తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉన్న తమిళ హీరోల లిస్ట్ తీస్తే అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ నెంబర్ 1 స్థానం లో ఉంటాడు. ఆయన సినిమాలు మన టాలీవుడ్ లో మన స్టార్ హీరోల రేంజ్ లో వసూళ్లు రాబట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతెందుకు గత ఏడాది విడుదలైన ‘జైలర్’ చిత్రం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ కి మించి రెండు రెట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టాయి. భోళా శంకర్ చిత్రానికి ఫ్లాప్ టాక్ రాగా, జైలర్ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.
దాంతో జైలర్ చిత్రానికి కేవలం తెలుగు వెర్షన్ కి కలిపి వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో రజినీకాంత్ తెలుగు మార్కెట్ మళ్ళీ తిరిగి వచ్చేసిందని, ఎప్పటిలాగానే ఇక మీదట కూడా మన తెలుగు హీరోలను డామినేట్ చేస్తాడు అంటూ ట్రేడ్ పండితులు సైతం చెప్పుకొచ్చారు. కానీ రజినీకాంత్ అసలు స్టామినా నిన్న విడుదలైన ‘లాల్ సలాం’ చిత్రం తో తెలిసింది.
ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన ఈ సినిమా పై మొదటి నుండి అటు అభిమానుల్లో కానీ, ఇటు ప్రేక్షకుల్లో కానీ ఎలాంటి అంచనాలు లేవు. టీజర్,ట్రైలర్ ఇలా ఏవి కూడా అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తమిళనాడు లో ఈ చిత్రానికి కేవలం నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చాయి. ఇక తెలుగులో అయితే ఈ సినిమా ఓపెనింగ్స్ వర్ణనాతీతం.
కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదట. ట్రేడ్ పండితులు అందిస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన వసూళ్లు అక్షరాలా గుండు సున్నా. ఇది నిజంగా జీర్ణించుకోలేనిది. ఇన్నేళ్ల రజినీకాంత్ సినిమాల్లో తెలుగు లో చాలా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. కానీ ఆయన ప్రతీ ఫ్లాప్ సినిమా కనీసం మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల ఓపెనింగ్ ని దక్కించుకునేది. కానీ ఈ సినిమాకి మాత్రం కనీసం కోటి రూపాయిల షేర్ కూడా రాకపోవడం గమనార్హం.
దీనిని బట్టీ రజినీకాంత్ కి కూడా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఓపెనింగ్స్ రావాలంటే కచ్చితంగా ప్రమోషనల్ కంటెంట్ బాగుండాలి. ఇలా ప్రమోషనల్ కంటెంట్ తో సంబంధం లేకుండా, ముఖ్యమైన పాత్రతో, ఎలాంటి హైప్ లేని సినిమాకి వసూళ్లు రాబట్టడం ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యం, గత ఏడాది ఆయన ముఖ్య పాత్ర పోషించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం డీసెంట్ ఓపెనింగ్స్, లాంగ్ రన్ ని దక్కించుకుంది.