US Box Office : వారాంతంలో యూఎస్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన ప్రధాన చిత్రాలు రవితేజ ‘ఈగిల్’, రజినీకాంత్ ‘లాల్ సలాం’, ‘యాత్ర 2’ ఉన్నాయి. ఇవన్నీ అభిమానులను ఆకట్టుకోవడంలో నమోదు చేయడంలో విఫలమయ్యాయి. అన్నీ ఫ్లాప్స్ గా ప్రకటించారు.
ఫస్ట్ వీకెండ్ లో రవితేజ గత చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’ కంటే ‘ఈగల్’ మూవీ గణనీయంగా తక్కువ వసూళ్లు సాధించింది. మొదటి వారాంతంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ 296 వేల డాలర్లు వసూలు చేయగా, ‘ఈగిల్’ 260 వేల డాలర్లు వసూలు చేసింది.
ఈ మూవీతో రవితేజకు మార్కెట్ తక్కువగానే ఉందని దాదాపు కన్ఫమ్ అయిపోయినట్లుంది. నిర్మాతలు అతిశయోక్తిగా చెప్పినప్పటికీ, ఈ చిత్రం పేలవమైన ప్రదర్శనను కనబరిచింది.
#ఈగల్: శుక్రవారం $90,522, శనివారం $71,704, ఆదివారం $70,504, $30k (apprx) టోటల్ వీకెండ్ గ్రాస్: $262 కే దక్కించుకుంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర 2’ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొదటి వీకెండ్ లో చాలా తక్కువ వసూళ్లను రాబట్టింది.
#యాత్ర: శుక్రవారం $75,725, శనివారం $14,886, ఆదివారం $16,471, $3k (apprx) టోటల్ వీకెండ్ గ్రాస్: $110 కే దక్కించుకుంది.
జానర్, డైరెక్టర్ లాంటి తేడా లేకుండా అమెరికాలో భారీ ఓపెనింగ్స్ ఉన్న అతి కొద్ది మంది భారతీయ స్టార్లలో రజినీకాంత్ ఒకరు. ‘లాల్ సలాం’లో ప్రధాన కథానాయకుడిగా నటించకపోయినప్పటికీ, అతని పొడిగించిన అతిథి పాత్ర కారణంగా, డీసెంట్ నంబర్లను ఆశించవచ్చు. అయితే రజినీకాంత్ డై హార్డ్ అభిమానులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపలేదు. అది డిజాస్టర్ గా ముగిసింది.