Eagle : మాస్ మహరాజ రవితేజకు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. ధమాకా పర్వాలేదనిపించినా టైగర్ నాగేశ్వర్ రావు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు రిలీజైన ‘ఈగల్’ కూడా బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శనతో సాగుతోంది. ఈ మూవీ వీకెండ్ ను ఏ మాత్రం ఆకర్షించలేకపోయింది. దీనికి తోడు సెకెండ్ సాటర్ డే కూడా వచ్చింది. అయినా కూడా మూవీ ఆకట్టుకోలేపోయింది.
రవితేజ, కావ్య థాపర్ జంటగా నటించిన యాక్షన్ చిత్రం ‘ఈగిల్’. శుక్రవారం (ఫిబ్రవరి 09) విడుదలైన ఈ సినిమా భారతదేశంలో రూ. 10 కోట్ల మైలురాయిని అధిగమించినప్పటికీ శనివారం బాక్సాఫీస్ వద్ద కొద్దిపాట క్షీణతను కనబర్చింది. Sacnilk.com ప్రకారం ఈ చిత్రం విడుదలైన రెండో రోజు అన్ని భాషల్లో కలిపి సుమారు రూ.4.75 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
శుక్రవారం అన్ని భాషల్లో కలిపి ‘ఈగిల్’ ఇండియాలో రూ.6.2 కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఇందులో తెలుగు వెర్షన్ తొలి రోజు రూ.6.1 కోట్లు రాబట్టగా, హిందీ వెర్షన్ దేశీయంగా రూ.10 లక్షలు రాబట్టింది. ఈ లెక్కలతో ‘ఈగిల్’ రెండు రోజుల్లో అన్ని భాషల్లో కలిపి ఇండియాలో రూ.10.95 కోట్లు వసూలు చేసింది.
‘సహదేవ్’ పేరుతో హిందీలో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం శనివారం మొత్తం తెలుగు ఆక్యుపెన్సీని 32.84 శాతం కొనసాగించింది. రవితేజ, కావ్యా థాపర్, నవదీప్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.