Hero Remuneration : సినిమా పరిశ్రమలో ఎవరి లక్ ఎటు తిరుగుతుందో తెలియదు. చిన్న చిన్న పాత్రలు చేసి ఒక్కసారిగా హీరోగా మారిన విషయం తెలుసు. అలా సినిమా రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాస్ హీరోగా ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. తనకంటూ ఓ మేనరిజం సంపాదించుకుని ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఏడాదికి మూడు నుంచి ఐదు సినిమాలు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.
పలు సినిమాల్లో చిన్న వేషాలు వేశాడు. దర్శకుడిగా మారాలని వచ్చిన అతడు అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలు చేశాడు. అలా అలా రాణిస్తూ హీరోగా మారాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో నీకోసం సినిమాతో హీరోగా మారి అదరగొట్టాడు. తరువాత ఇట్లు శావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించి తడాఖా చూపించుకున్నాడు.
కర్తవ్యం, కన్నడ అభిమన్యు, చైతన్య, ఆజ్ కా గుండారాజ్ సినిమాల్లో చిన్న వేషాలు వేశాడు రవితేజ. కెరీర్ ఆరంభంలో రూ.500 వేతనంతో ప్రారంభించిన అతడి జీవితం ఇప్పుడు అతడి సినిమాలు రూ. 100 కోట్ల వసూళ్లకు చేరుకోవడం విశేషం. అల్లరి ప్రియుడు, మనసిచ్చి చూడు, నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేశాడు. ఖడ్గం, ఆటోగ్రాఫ్ సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. విక్రమార్కుడు సినిమాతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు తీసుకుంటున్నాడు. సినిమాల్లో తన రేంజ్ పెంచుకున్నాడు. దర్శకుడిగా కావాలని వచ్చి హీరోగా చేస్తున్నాడు. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఇప్పుడు ఎక్కువ రెమ్యూనరేష్ తీసుకుంటూ అందరిలో ఆశ్చర్యం నింపుతున్నాడు. రానున్న రోజుల్లో మరింత పారితోషికం పెంచుకునేందుకు రవితేజ ముందుకు వెళ్తున్నాడు.