Ravi Teja మాస్ మహారాజ రవితేజ హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను రిలీజ్ చేస్తూనే ఉంటాడు. ప్లాప్ అంటూ అక్కడే ఆగిపోతే ముందుకు వెళ్లడం కష్టమే.. అందుకే ఈయన అయిపోయిన సినిమాను పట్టించుకోకుండా ముందు ముందు చేయబోయే సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉంటాడు..
ఇక ఈయన వరుసగా సీజన్స్ ను టార్గెట్ చేస్తూ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇలా సీజన్స్ లో మూవీలు రిలీజ్ చేస్తే కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన అది సూపర్ హిట్ కావడం ఖాయం.. అందుకే మాస్ రాజా తెలివిగా సీజన్స్ లోనే తన సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈయన రిలీజ్ చేసిన సినిమాలు ఎలా హిట్ అయ్యాయో చూద్దాం..
ధమాకా : రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ధమాకా.. ఈ సినిమా 2022 క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది. రొటీన్ మూవీ అయినప్పటికీ ఇందులో అన్ని వర్కౌట్ అవ్వడంతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
వాల్తేరు వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి, రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ తనదైన నటనతో అందరిని కట్టిపడేసాడు. ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యింది.
రావణాసుర : రవితేజ – సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా 2023 సమ్మర్ లో వచ్చింది. ఈ థ్రిల్లర్ లో రవితేజ రెచ్చిపోయిన తేడా కొట్టడంతో సక్సెస్ కాలేక పోయింది.
టైగర్ నాగేశ్వరరావు : ప్రజెంట్ ఈయన వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా చేస్తున్నాడు.. ఇది బయోపిక్ కావడం అందులోను పాన్ ఇండియన్ కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇది దసరా సీజన్ లో రిలీజ్ కానుంది.
ఈగల్ : రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్.. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తుదనగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా పెట్టుకున్నాడు.