
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు ముంబైలో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా – భారత్ ల మధ్య జరుగుతున్న మొదటి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుండటంతో ఆ మ్యాచ్ ను చూడటానికి వచ్చాడు రజనీకాంత్. ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ రజనీకాంత్ ను మ్యాచ్ కు ఆహ్వానించాడు. దాంతో తన భార్యతో కలిసి ముంబైకి వెళ్ళాడు సూపర్ స్టార్.
వీఐపీ గ్యాలరీ లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న రజనీకాంత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మ్యాచ్ జరుగుతున్న సమయంలో బిగ్ స్క్రీన్ పై రజనీకాంత్ కనిపించిన ప్రతీసారి స్టేడియమంతా హోరెత్తిపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ని చూస్తే చాలు అభిమానులకు పూనకాలే ! ఎందుకంటే స్టైల్ …… స్టైల్ లో రజనీకాంత్ ని మించినవారు లేరంటే అతిశయోక్తి కాదు సుమా ! అందుకే ఆయన్ని స్టైల్ కింగ్ అంటారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంలో నటిస్తున్నాడు. దాంతో పాటుగా లాల్ సలాం అనే చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నాడు.
ఇక క్రికెట్ మ్యాచ్ విషయానికి వస్తే ….. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 188 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ పోరాడుతోంది.