అగ్రరాజ్యం అమెరికాలో వర్ణ వివక్ష ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి. ఇక అమెరికాలో ఉంటున్న భారతీయులపై ఇలాంటి దాడులు చాలా జరుగుతున్నాయి. ఇటీవలే ఓ భారతీయ మహిళను ఓ అమెరికన్ ఇష్టమొచ్చిన రీతిలో బండ బూతులు తిట్టడమే కాకుండా దాడి కూడా చేసింది. ఆ సంఘటన మర్చిపోకముందే మరో సంచలన సంఘటన ఆగస్ట్ 21 న జరిగింది.
కాలిఫోర్నియాలో బీఫ్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతుంది. కాగా ఆ బీఫ్ ఫెస్టివల్ లో ఇండియన్ అయిన కృష్ణన్ జయరామన్ పై ఇండో అమెరికన్ అయిన తేజిందర్ సింగ్ దాడి చేయడం సంచలనంగా మారింది. విపరీతంగా బూతులు తిట్టడమే కాకుండా దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో తేజిందర్ సింగ్ పై ఫిర్యాదు చేయడంతో స్పందించిన అమెరికా పోలీసులు తేజిందర్ సింగ్ ను అరెస్ట్ చేశారు.