చైనాలో సైనిక తిరుగుబాటు జరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ జీవిత కాల అధ్యక్షుడుగా ఉంటారని ప్రకటించిన నేపథ్యంలో చైనా సైన్యం తిరుగుబాటు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జిన్ పింగ్ హౌజ్ అరెస్ట్ అయినట్లుగా సమాచారం.
ప్రపంచంలో అత్యధిక ఆధునిక సైన్యం కలిగిన దేశంగా చైనా నిలిచిన విషయం తెలిసిందే. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ గా పిలుచుకునే చైనా ఆర్మీ అధ్యక్షుడు జిన్ పింగ్ కు నమ్మకంగా ఉంది ఇన్నాళ్లు. అయితే జిన్ పింగ్ లో నియంతృత్వ పోకడలు ఎక్కువ కావడంతో ఆ నియంతను కట్టడి చేయాలని భావించిందట చైనా సైన్యం. అందుకే సైనిక చర్యకు ఉపక్రమించినట్లు సమాచారం. సైనిక చర్యతో చైనాలో రాజకీయ సంక్షోభం నెలకొందని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చైనాలో జరుగుతున్న విషయాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.