
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన టీమ్ లో మరో ఇద్దరు భారతీయులకు కీలక బాధ్యతలు అప్పగించాడు. మనీష్ బప్నా, రేవతి అద్వైతి లకు వర్తక విధానం , సంప్రదింపుల సలహా కమిటీలో చోటు కల్పించాడు. జో బైడెన్ ఇప్పటికే పలువురు ఇండో అమెరికన్ లకు అవకాశాలు ఇవ్వగా తాజాగా రేవతి , మనీష్ లకు స్థానం కల్పించడంతో మరోసారి భారతీయుల సత్తా యావత్ ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది.
రేవతి అద్వైతి: పలు సంస్థల్లో కీలక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించింది. అత్యంత శక్తివంతమైన బిజినెస్ విమెన్ జాబితాలో వరుసగా నాలుగుసార్లు స్థానం దక్కించుకుని సంచలనం సృష్టించింది. 55 సంవత్సరాల రేవతి అద్వైతి తల్లిదండ్రులు ప్రస్తుతం చెన్నై లో స్థిరపడ్డారు. వృత్తి రీత్యా బీహార్ , గుజరాత్ , అస్సాం తదితర ప్రాంతాల్లో పనిచేసారు రేవతి తండ్రి ANN స్వామి. ఆయన కెమికల్ ఇంజినీర్ కావడంతో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పని చేయాల్సి వచ్చింది. ANN స్వామి – విశాలం స్వామి దంపతులకు 1967 లో జన్మించింది రేవతి అద్వైతి. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో తన ఇద్దరు పిల్లలు భర్తతో కలిసి నివసిస్తోంది రేవతి.