ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది ….. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యింది. ఆమేరకు ఎన్నికల ఫలితాలు వెల్లడించారు. బ్రిటన్ ప్రధాని రేసులో పలువురు పోటీ పడినప్పటికీ చివరికి లిజ్ ట్రస్ – రిషి సునాక్ ల మద్యే పోటీ నెలకొంది. అయితే ఎంపీల మద్దతు విషయంలో భారత సంతతికి చెందిన రిషి సునాక్ కు ఎక్కువ మద్దతు లభించినప్పటికీ కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతు ఎక్కువగా లిజ్ ట్రస్ సొంతం చేసుకుంది. దాంతో 21 వేల ఓట్ల తేడాతో రిషి సునాక్ ని ఓడించి బ్రిటన్ ప్రధాని అయ్యింది లిజ్ ట్రస్.
Breaking News