
నార్త్ కరోలినా రాష్ట్రంలోని చార్లెట్ నగరంలో Carolina NRI TDP విభాగం అధ్వర్యంలో తెలుగు వారి గుండెల్లో నాటికీ నేటికీ ఎప్పటికి చెరగని ప్రతిరూపం మన ఆరాధ్య రాముడు *శ్రీ నందమూరి తారక రామారావు * గారి 27వ వర్ధంతి సందర్బంగా నివాళి అర్పించారు.
NRI TDP నాయకులు శ్రీ గుదే పురుషోత్తం చౌదరి,
ఠాగూర్ మల్లినేని, సచ్చింద్ర ఆవులపాటి, వెంకట్ సూర్యదేవర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

షార్లెట్ లోని అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు 150 మందికి పైగా కుటుంబాలతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ శ్రీ బోడె ప్రసాద్ గారు మరియు అనంతపురం మాజీ శాసనసభ్యులు శ్రీ ప్రభాకర చౌదరి గార్లు వర్చువల్ గా ముఖ్య అతిధిలుగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశ్యించి ప్రసంగించారు.