కొత్తగా బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ కు ఊహించని షాక్ ఇచ్చింది హోం సెక్రటరీ ప్రీతి పటేల్ . బోరిస్ జాన్సన్ కు నమ్మిన బంటు అయిన ప్రీతి పటేల్ జాన్సన్ మంత్రివర్గంలో హోమ్ శాఖలో సెక్రటరీ గా పనిచేసింది. జాన్సన్ రాజీనామా చేయడంతో ప్రధాని పదవికి పోటీ చేసే జాబితాలో ప్రీతి పటేల్ పేరు కూడా వినిపించింది. కట్ చేస్తే ప్రీతి పోటీ నుండి తప్పుకుంది.
ఇక బోరిస్ జాన్సన్ మద్దతు లిజ్ ట్రస్ కు ఉంది కాబట్టి ప్రీతి పటేల్ కూడా హోమ్ శాఖ సెక్రటరీగా కొనసాగుతుందని అనుకున్నారు అంతా. కట్ చేస్తే అలా లిజ్ ట్రస్ గెలవడమే ఆలస్యం ఇలా తన పదవికి రాజీనామా చేసి షాక్ ఇచ్చింది. దాంతో కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు షాక్ అవుతున్నారు. అయితే గతకొంత కాలంగా ప్రీతి పటేల్ కు లిజ్ ట్రస్ కు మధ్య తీవ్ర విబేధాలు ఉన్నాయని అందుకే ఆమె నాయకత్వంలో పని చేయడం ఇష్టం లేకే రాజీనామా చేసి ఉంటుందని వినిపిస్తోంది.
అయితే ప్రీతి పటేల్ మాత్రం మరోలా అంటోంది. కొత్త నాయకత్వం వాళ్లకు నమ్మిన వాళ్ళను నియమించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సౌలభ్యం కోసమే తన రాజీనామా అంటూ ప్రకటించడమే కాకుండా లిజ్ ట్రస్ కు అభినందనలు తెలియజేసింది. ప్రీతి పటేల్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం విశేషం.